telugu navyamedia
క్రైమ్ వార్తలు

మూడ న‌మ్మ‌కాల‌తో కూతురు చంపిన తండ్రి ..

నెల్లూరుజిల్లాలోని ఆత్మ‌కూరులో దారుణ ఘ‌ట‌న‌ చోటుచేసుకుంది. మూడ న‌మ్మ‌కాల‌తో కన్న తండ్రి ఘాతుకానికి చిన్నారి పునర్విక మృతి చెందింది.

వివారాల్లోకి వెళితే..

ఆత్మకూరు పెద్దిరెడ్డిపల్లి కి చెందిన వేణుకు పెళ్లి అయిన 12 ఏళ తర్వాత పూర్విక, పునర్విక(4) కవల పిల్లలు జన్మించారు.

తమ కుటుంబానికి ఏదో చెడు జరుగుతుందని భావించిన తండ్రి శాంతి పూజలు చేయాలని భావించాడు. తండ్రి వేణు.. తన ఇంట్లో క‌ల‌వ‌పిల్ల‌ల్లో ఒక‌రైన చిన్న పాపను కూర్చోపెట్టి క్షుద్రపూజలు చేశాడు.

అనంతరం చిన్నపాప మీద పసుపు నీళ్లు పోసి, కుంకుమను నోట్లో కుక్కి ఊపిరాకుండా చేశాడు.  తీవ్ర అస్వస్థతకు గురైన చిన్నారి చెన్నై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించింది.

 చిన్నారి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. విషయం తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకని కసాయి తండ్రి వేణును అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

 

 

Related posts