telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు సామాజిక

ప్లాస్టిక్ తో కడుపు నింపుకుంటున్న చేపలు… వీడియో వైరల్

fish

స్పెయిన్‌లోని కెనారాస్‌ దీవుల్లో ఓ మత్య్సకారుడి వలకు చిక్కిన ఒక చేప పొట్ట భారీ మొత్తం ప్లాస్టిక్‌తో నిండిపోయి ఉంది. చేప పొట్టలో ఏదో విచిత్రమైన వస్తువు ఉందని భావించిన మత్య్సకారుడు కోసి చూడగా దాని పొట్ట మొత్తం ప్లాస్టిక్‌తో నిండిపోయి ఉండడం కనిపించింది. అయితే, పొట్టలో ప్లాస్టిక్‌ ఉనప్పటికీ చేప సజీవంగానే ఉండడం గమనార్హం. దీనికి సంబంధించిన వీడియోను అతను ట్విట్టర్‌లో షేర్ చేయడంతో అది కాస్తా వైరల్ అయింది. ప్లాస్టిక్ పర్యావరణాన్ని ఎంతలా కలుషితం చేస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకవైపు మానవాళికి ప్లాస్టిక్ వల్ల తీవ్ర ముప్పు పొంచి ఉందని పర్యావరణ వేత్తలు హెచ్చరిస్తున్న.. మరోవైపు మనం ఆ హెచ్చరికలను బేఖాతరు చేస్తూ యథావిధిగా ప్లాస్టిక్ వాడకాన్ని కొనసాగిస్తున్నం. మానవాళితో పాటు జల చరాలకు కూడా తీవ్ర హాని కలిగించే ఈ ప్లాస్టిక్ భూతాన్ని నివారించేందుకు ఎన్ని చర్యలు తీసుకుంటున్న ఫలితం మాత్రం కనిపించడం లేదు. ఇక ప్లాస్టిక్ వ్యర్థాలను సముద్ర జలాల్లో కలపడం వల్ల వాటిలోని జీవులకు ప్రాణాంతకంగా పరిణమిస్తోంది. ఇప్పటికే దీనికి ఎన్నో ఘటనలు రుజువుగా నిలిచాయి కూడా.


Video Credits : Viral Star

Related posts