శాస్త్రోప్తవేతంగా వేదబ్రాహ్మణులమంతోచ్చారణాలతోశ్రీసీతారామచంద్రస్వామివారికి పట్టాభిషేకం జరగనుంది. భద్రాచలంలోని శ్రీరామనవమి సందర్బంగా కల్యాణం నిర్వహించిన మిథిలా స్టేడియం వేదికపైనే స్వామి వారికి పట్టాభిషేకం ప్రాంభిస్తారు. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. మేళతాళాల నడుమ స్వామివారి ఉత్సవ మూర్తులను పల్లకిలో మిథిల స్టేడియంలో ఆసీనం చేశారు.
అనంతరం విశ్వక్షేణ ఆరాధనతో పట్టాభిషేక మహోత్సవాన్ని ప్రారంభిస్తారు. ఇందుకు వినియోగించే పూజా ద్రవ్యాలకు పుణ్యహోచనం చేశారు. తర్వాత పవిత్ర నదీజలాలతో స్వామివారికి అభిషకం జరిపి, సువర్ణపుష్పార్చన చేస్తారు. ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు భక్తులు భారీ సంఖ్యలో మిథిలా స్టేడియం చేరుకున్నారు.