గతంలో ఆడుకోడానికి బయటకు వెళ్లేందుకు అనుమతి అడిగేవారు పిల్లలు; నేడు అదేపనిగా వీడియో గేమ్ లు ఆడుకోడానికి అడుగుతున్నారు. కాస్త సమయం దొరికితే, అయితే మొబైల్ లేదా కంప్యూటర్ లో వీడియో గేమ్ లు ఆడేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే ఈ ఆటలకు వాళ్ళు బానిసలు అయిపోయారంటే అతిశయోక్తి కాదు. ఈ నేపథ్యంలోనే, ఓ 11 ఏళ్ళ పిల్లవాడు, ఆన్‌లైన్ గేమ్ పబ్జిపై నిషేధం విధించాలని కోరుతూ బాంబే హైకోర్టును ఆశ్రయించాడు. అంతకుముందు ఈ విషయంపై మహారాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్‌కు లేఖ రాసిన ఆ విద్యార్థి.. హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు.
అహద్ నిజాం అనే విద్యార్థి తన కుటుంబంతో కలిసి ముంబయిలోని బంద్రాలో నివాసముంటున్నాడు. పబ్జి కారణంగా అనేక మంది విద్యార్థులు హింసకు ప్రేరేపితులవుతున్నారని, దీన్ని వెంటనే నిషేధించాలని కోరుతూ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్రమంత్రికి లేఖ రాశాడు. తాజాగా తన తల్లితో కలిసి బాంబే హైకోర్టులో పిటిషన్ వేశాడు. అంతేగాక ఆన్‌లైన్‌లో ఇలాంటి హింసను ప్రేరేపించే కంటెంట్‌ను పరిశీలించడానికి ఓ ఆన్‌లైన్ ఎథిక్స్ రివ్యూ కమిటీని ఏర్పాటు చేసేలా కేంద్రప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని అహద్ తన పిటిషన్‌లో పేర్కొన్నాడు.
అంతకుముందు జమ్ము కశ్మీర్ విద్యార్థి యూనియన్ కూడా ఈ గేమ్‌పై నిషేధం విధించాలని ఆ రాష్ట్ర గవర్నర్ సత్యపాల్ మాలిక్‌ను కోరింది. పబ్జి వల్ల విద్యార్థులు చదువు పట్ల శ్రద్ధ పెట్టట్లేదని, తద్వారా పరీక్షల్లో ఫెయిల్ అవుతున్నారని విద్యార్థి యూనియన్ పేర్కొంది. కాగా.. ఇటీవలే గుజరాత్ ప్రభుత్వం దీనిపై ఆంక్షలు విధించింది. పబ్జిని నిషేధించాలని రాష్ట్రంలోని అన్ని పాఠశాలలను ఆదేశించింది కూడా. ఏమైనా గుజరాత్ లో ఉన్నత వేగవంతమైన ప్రభుత్వ సేవలు మిగిలిన చోట్ల ఉండవేమో!!
రాత్రిపూట రసాయనాలను వదిలేస్తున్నారు: రేవంత్ రెడ్డి