telugu navyamedia
క్రీడలు వార్తలు

ఆ బౌలర్ పై ఉన్న నిషేధాన్ని ఎత్తివేసిన బీసీసీఐ…

ముంబై మాజీ లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌ అంకిత్‌ చవాన్‌పై ఉన్న నిషేధాన్ని బీసీసీఐ తాజాగా ఎత్తివేసింది. బీసీసీఐ నిషేధం ఎత్తివేయడంతో ఇకపై ప్రొఫెషనల్‌ క్రికెట్‌ ఆడేందుకు అతడికి గ్రీన్‌ సిగ్నల్‌ లభించినట్లయింది. నిషేధం ముగియడంతో మైదానానికి ఎప్పుడెప్పుడు వెళ్తానా అని ఎదురు చూస్తున్నట్టు చవాన్‌ తెలిపాడు. కరోనా వైరస్ మహమ్మారి, వర్షాల కారణంగా మైదానంకు వెళ్లలేకపోతున్నానని పేర్కొన్నాడు. ఐపీఎల్ 2013లో స్పాట్‌ ఫిక్సింగ్‌ కేసులో భారత వెటరన్ క్రికెటర్‌ ఎస్ శ్రీశాంత్‌తో పాటు అంకిత్‌ చవాన్‌పై బీసీసీఐ శాశ్వత నిషేధం విధించింది. శ్రీశాంత్‌ కోర్టుల చుట్టూ తిరిగి నిర్దోషినని నిరూపించుకొనే ప్రయత్నాలు చేశాడు. ఆఖరికి కోర్టుల సూచనతో పాటు స్వయంగా విచారించిన అంబుడ్స్‌మన్‌ అతడిపై నిషేధాన్ని ఏడేళ్లకు తగ్గించారు. 2020 సెప్టెంబర్లోనే అతడి నిషేధం ముగిసింది. ఆపై శ్రీశాంత్‌ దేశవాళీ టోర్నీ ఆడాడు. తన పదునైన బంతులతో వికెట్లు కూడా పడగొట్టాడు. ఐపీఎల్ 2021 కోసం అప్లై చేసుకున్నా.. నిరాశ తప్పలేదు.

Related posts