telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

అమిత్‌షాను కలిసిన వైసీపీ ఎంపీలు..

Amit

అమిత్‌షాను కలిసిన వైసీపీ ఎంపీలు వంగ గీత, పిల్లి సుభాష్ చంద్రబోస్ కలిశారు. ఈ సందర్భంగా ఎంపీ వంగ గీత మాట్లాడుతూ.. “దిశ” చట్టాన్ని ఆమోదించాలని కేంద్ర హోంమంత్రిని కోరామని ఎంపీ వంగ గీత అన్నారు. తెలంగాణలో జరిగిన ఘటన నేపథ్యంలో మహిళల రక్షణ కోసం సీఎం జగన్ ఈ చట్టాన్ని తెచ్చారని… త్వరగా “దిశ” చట్టానికి ఆమోదం తెలపాలని అందుకు ఐపీసీ, సీఆర్ పీసి సెక్షన్లలో చేయాల్సిన మార్పులు చేయాలని కోరామని తెలిపారు. మహిళలపై దాడుల ఘటనను వేగవంతంగా దర్యాప్తు చేసేందుకు “దిశ” చట్టం వీలు కల్పిస్తుందని పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాలు కూడా “దిశ” చట్టాన్ని తేవాలన్న ఆలోచనలు చేస్తున్నట్టు కథనాలు వస్తున్నాయని.. ఇది దేశవ్యాప్తంగా ఉపయోగపడే చట్టమన్నారు. రాష్ట్రంలో సీఎం జగన్ అన్ని రంగాల్లో మహిళలకు పెద్దపీట వేస్తున్నారని వెల్లడించారు.
అనంతరం ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ… విశాఖ స్టీల్ ప్లాంట్, అంతర్వేది రథం దగ్దం ఘటనపై సీబీఐ విచారణ, పోలవరం నిధులు సహా “దిశ” చట్టాన్ని ఆమోదించమని కోరామని తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో సీఎం జగన్ చేసిన ప్రతిపాదనలను పరిగణలోకి తీసుకోవాలని కోరామని… దీనికి కేంద్ర హోంమంత్రి సానుకూలంగా స్పందించారని తెలిపారు. అంతర్వేది రథం దగ్దం ఘటనపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరామని..వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని కోరామన్నారు. పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాలను ఆమోదించాలని కోరామని పేర్కొన్నారు.

Related posts