telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

‘క్లియోపాత్ర‌’పై ప్ర‌శంస‌లు కురిపించిన త‌మ్మారెడ్డి

cliyopatra

మోహన్ కృష్ణ  బెల్లం కొండ, రేఖ నిరోషా హీరోహీరోయిన్లుగా AVOTALE బ్యానర్ పై  సాయి సూర్య వీరిశెట్టి సమర్పణ లో అశోక్ వర్మ  తెరకెక్కించిన ప్రేమకథ ల‌ఘు చిత్రం “క్లియోపాత్ర”.  శ్రీనివాస్ వడుపు ,రణధీర్ వైట్ల, బాపి రాజు లంకె సంయుక్తంగా నిర్మించిన ఈ మూవీ ప్రీమియర్ షో హైద్రాబాద్ రామానాయుడులో  జరిగింది. ఈ ప్రీమియర్ ను సినీ ప్రముఖులు  దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, సంగీత దర్శకురాలు  శ్రీలేఖ, నిర్మాత సంజయ్ రెడ్డి ప్రత్యేకంగా వీక్షించి చిత్ర‌యూనిట్‌ను అభినందించారు.

ముఖ్య అధితి తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ… ఓ కాంప్లికేటెడ్ పాయింట్ ను తీసుకొని ప్రేమకథను  తెరకెక్కించి, మెప్పించడం చాలా కష్టం .. దర్శకుడు అశోక్ వర్మ అందులో  సక్సెస్ అయ్యాడు  అని  అన్నారు . మొదటి  ప్రయత్నం లో ఇంత బాగా  తీయడం హర్షించ దగ్గ విషయం అన్నారు .. నటీనటులు,టెక్నిషియన్స్ కి మంచి భవిష్యత్తు ఉందని తెలిపారు .

సంగీత  దర్శకురాలు శ్రీలేఖ మాట్లాడుతూ… లవ్  అనేది ఎవర్ గ్రీన్ .. కొత్త ప్రేమకథను  చూసిన ఫీలింగ్ కలిగింది . నాకు క్లైమాక్స్ హార్ట్ టచింగ్ అనిపించింది . అందరు ఇంకా కష్టపడండి .. ఇంకా ముందుకు వెళ్తారని అన్నారు

నిర్మాత  సంజయ్ రెడ్డి మాట్లాడుతూ… కాంప్లికేటెడ్ సబ్జెక్ట్ ను బాగా తీశారని అన్నారు .. యూనిట్ సబ్యులకు అల్ ది బెస్ట్ చెప్పారు. చిత్ర  దర్శకుడు  అశోక్ వర్మ  మాట్లాడుతూ… ఈ  కథ రాసుకున్నప్పుడు  ఈ సబ్జెక్టు  నాన్ లీనియర్ ,మల్టీ లేయర్ అని  తెలియదు.. తెలిసాక చాలెంజ్  గా తీసుకొని రోపొందించాము అన్నారు.. ఈ  ఫిలిం ఇంత బాగా రావటానికి మా టీమ్  ఎంతో సపోర్ట్ చేసిందని అన్నారు

హీరో హీరోయిన్లు  మోహన్ కృష్ణ  బెల్లం కొండ,రేఖ నిరోషా అవకాశం ఇచ్చిన  దర్శక నిర్మాతలకు , ప్రీమియర్ కు వచ్చిన  ముఖ్య అధితులకు థాంక్స్  తెలిపారు . ఈ  కార్యక్రమంలో  చిత్రయూనిట్ కూడా   పాల్గొన్నారు.నటీనటులు:  మోహన్ కృష్ణ  బెల్లం కొండ, రేఖ నిరోషా , శివ, డా . హెచ్ .వినయ్ కుమార్ , రమ్య , ప్రవల్లిక , బేబీ సహన్య , లీలా ప్రసాద్

Related posts