బాలీవుడ్ ఎంట్రీకి సిద్దమవుతున్న బెల్లం కొండ సాయిశ్రీనివాస్… దాని కన్నా ముందు తెలుగులో ఓ కొత్త సినిమాను విడుదల చేయనున్నాడు. ఈ సినిమా పేరు అల్లుడు అదుర్స్‌గా ఫిక్స్ అయింది. సాయి హీరోగా కందిరీగ ఫేమ్ సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపిందుతోంది. ఇందులో నభా నటేష్, అను ఇమాన్యూయెల్‌లు హీరోయిన్‌లుగా కనిపించనున్నారు. అంతేకాకుండా ప్రముఖ నటులు సోనూ సూద్, ప్రకాషర్ రాజ్‌లు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. తెలుగు ప్రేక్షకులకు శుభాకాంక్షలు తెలుపుతూ ఈ సినిమా పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్ బ్లూగా ఎంతో రిచ్ లుక్‌తో ఆసక్తిగా ఉంది. రాక్షసుడు సినిమా తరువాత సాయి ఈ క్రేజీ సినిమాతో అందరి ముందుకు రానున్నాడు. ఈ సినిమాపై అభిమానులతో పాటు సాయి కూడా భారీగా అంనాలు పెట్టుకున్నాడు. ఈ సినిమా సుమంత్ మూకీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గొర్రెల సుబ్రహ్మణ్యం నిర్మిస్తున్నారు. ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయనున్నాట్లు ఇంతకుముందే మేకర్స్ తెలిపారు. అయితే ఇప్పటికే సంక్రాంతి బరిలో రామ్ రెడ్, రవితేజా క్రాక్ సినిమాలు ఉన్నాయి. మరి సంక్రాంతికి సాయి వారితో తలపడతాడా లేకుంటే వేరే డేట్ ఫిక్స్ చేసుకుంటాడా అనేది చూడాలి మరి.
previous post
next post
ఉల్లి కోసం ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి: లోకేశ్