మిల్కీ బ్యూటీ తమన్నా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. దాదాపు దశాబ్దకాలం పాటు దక్షిణాదిన అగ్ర హీరోయిన్‌గా వెలుగొందింది. తెలుగు, తమిళ సినీ రంగాల్లో దాదాపు అగ్ర హీరోలందరితోనూ నటించింది. నటిగా పదిహేనేళ్లు పూర్తి చేసుకున్న తమన్నా ఇప్పటికీ వరుస సినిమాలతో, ఐటెం సాంగ్‌లతో బిజీగానే ఉంది. ప్రభుదేవాతో ఈమె రెండోసారి నటించిన “దేవి–2” చిత్రం ఇటీవలే తెరపైకి వచ్చింది. ముచ్చటగా మూడోసారి ప్రభుదేవాతో చేసిన చిత్రం “ఖామోషి” త్వరలోనే విడుదలకు సిద్ధమవుతోంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన తమన్నా తనకు ఓ బయోపిక్‌లో నటించాలని ఉన్నట్టు తెలిపింది. ప్రముఖ నటి శ్రీదేవి అంటే తనకు చాలా ఇష్టమని, ఆమె నిజ జీవిత కథలో నటించే అవకాశం రావాలని కోరుకుంటున్నానని వెల్లడించింది. శ్రీదేవి తరహాలోనే తమన్నాకు కూడా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో మంచి గుర్తింపు ఉన్న సంగతి తెలిసిందే. మరి, ఆ అవకాశం తమన్నాను వరిస్తోందో, లేదో చూడాలి.
previous post