telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు

హుస్సేన్‌ సాగర్‌ జలాశయ శుద్ధి కి … జికా సంస్థ సహకారం..

jika company come forward to clean hussain sagar

జికా సంస్థ ప్రతినిధి నోబుకో ఫుజితా కలుషితమైన హుస్సేన్‌ సాగర్‌ జలాశయాన్ని శుద్ధి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వానికి సహకారం అందిస్తామని అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణ కోసం పాటుపడుతు న్న జపాన్‌ సంస్థ జికా ప్రతినిధులు మంగళవారం రాజీవ్‌నగర్‌ కాలనీని సందర్శించారు. ఈ సందర్భంగా పార్కులో ఏర్పాటు చేసిన సమావేశంలో జికా ప్రతినిధి మాట్లాడారు. ప్లాస్టిక్‌ వాడకం తగ్గించాలని ఆమె సూచించారు.

హైదరాబాద్‌ నగరాన్ని స్వచ్ఛ నగరంగా చేసే అన్ని ప్రయత్నాల్లో రాజీవ్‌ నగర్‌ కాలనీ కృషి ఉంటుందని ఉప కమిషనర్‌ రమేశ్‌ అన్నారు. రాజీవ్‌నగర్‌ కాలనీలో రెండో దఫా ఉచిత గన్నీ బ్యాగుల పంపిణీ కార్యక్రమాన్ని ఫుజితా, రమేశ్‌, కాలనీ అధ్యక్షుడు కృష్ణ శర్మ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సంక్షేమ సంఘ సెక్రటరీ ప్రసాదరావు, ప్రతినిధులు నజీర్‌, భుజంగరావు, సాగర్‌, బద్రుద్దీన్‌, శేఖర్‌రెడ్డి, ఆగస్టిన్‌, రవీంద్ర, పట్నాయక్‌, లక్ష్మోజీరావు, సుబ్బరాజు, కాలనీవాసులు, జీహెచ్‌ఎంసీ సిబ్బంది పాల్గొన్నారు.

Related posts