telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

రకుల్ ప్రీత్ సింగ్ యూట్యూబ్ ఆదాయం ప్రధాన మంత్రి నిధికేనట…

Rakul-PReeth-Singh

క‌రోనా మ‌హమ్మారిని తరిమికొట్టేందుకు కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు అనేక రకాలుగా చ‌ర్య‌ల‌ను చేప‌డుతున్నాయి. లాక్‌డౌన్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా షూటింగ్‌లకు బ్రేక్ పడిన విషయం తెలిసిందే. దీంతో సినీ ప్రముఖులందరూ ఇళ్లకే పరిమితం అయ్యారు. ప‌లువురు సెల‌బ్రిటీలు ప్ర‌భుత్వాల‌కు విరాళాల‌ను అందించ‌డ‌మే కాకుండా నైతికంగా త‌మ మ‌ద్ద‌తుని తెలియ‌జేస్తున్నారు. అయితే హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కు యూట్యూబ్ అకౌంట్ కూడా ఉంది. దీనికి 65వేల మంది సబ్‌స్ర్కైబర్లు ఉన్నారు. కానీ, ఈ అకౌంట్‌లో ఇప్పటి వరకు తన ఫిట్‌నెస్, యోగా వీడియోలు మాత్రమే రకుల్ అప్‌లోడ్ చేశారు. దీన్ని రెవెన్యూ జనరేషన్ కోసం వాడలేదు. తాజాగా తన యూట్యూబ్ ఛానెల్‌ను ఇప్పుడు యాక్టివ్ చేయడానికి గల కారణాన్ని కూడా రకుల్ ప్రీత్ సింగ్ వెల్లడించారు. ఈ ఛానెల్‌లో వంటల వీడియోలు అప్‌లోడ్ చేసి వాటి ద్వారా వచ్చే ఆదాయాన్ని ప్రధాన మంత్రి నిధికి అందజేస్తానని రకుల్ ప్రకటించారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా మంగళవారం (ఏప్రిల్ 7) నుంచి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నానని వెల్లడించారు. అందరూ తన యూట్యూబ్ ఛానెల్‌ను సబ్‌స్ర్కైబ్ చేసుకోవాలని కోరారు. తన తొలి ప్రయత్నంగా పాన్‌కేక్‌ను ఎలా తయారు చేయాలో చూపిస్తూ వీడియో చేసి యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేశారు.

Related posts