telugu navyamedia
సినిమా వార్తలు

శివ శంకర్ మాస్టర్ ఆరోగ్య పరిస్థితి విషమం..

ప్రముఖ డ్యాన్స్ కొరియోగ్రాఫర్ , జాతీయ అవార్డు గ్రహీత శివ శంకర్ మాస్టర్ ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. ఇటీవ‌ల ఆయ‌న కరోనా సోకడంతో గత నాలుగు రోజులుగా హైదరాబాద్ గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయనను పరీక్షించగా.. 75 శాతం ఊపిరితిత్తులకు ఇన్ ఫెక్షన్ సోకినట్లు వైద్యులు చెబుతున్నారు. రోజురోజుకీ ఆయన ఆరోగ్యం క్షీణిస్తున్నట్లు సమాచారం.

శివ శంకర్ మాస్టర్ పెద్ద పెద్దకుమారుడికి కూడా కరోనా పాజిటివ్‌గా తేలింది. ప్రస్తుతం ఆయన అపస్మారకస్థితిలో ఉన్నట్లు వైద్యులు తెలిపారు.అలాగే శివ శంకర్ మాస్టర్ భార్యకు కూడా కరోనా సోకగా.. ఆమెకు హోమ్ క్వారెంటైన్ లో ఉన్నారు. చిన్నకొడుకు అజయ్ కృష్ణ ఒక్కడే ప్రస్తుతం తండ్రి, అన్న, అమ్మ బాగోగులు చూసుకుంటున్నారు.

I will give Dance Choreographer Shiva Shankar's contact details for $3 : Babu - GreatFilmJobs.com

కాగా.. ఆయన చికిత్సకు లక్షల రూపాయలు ఖర్చవుతున్నాయని, తమ దగ్గర అంత డబ్బు లేకపోవడంతో దాతల సాయం కోసం ఎదురు చూస్తోంది ఆ కుటుంబం. ఎన్నో గొప్ప పాటలకు నృత్యాలను సమకూర్చి, జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. డ్యాన్స్‌ మాస్టర్‌గానే కాకుండా సుమారు 30 చిత్రాల్లో నటుడిగానూ అలరించిన‌ శివ శంకర్ మాస్టర్ కు ఇలాంటి పరిస్థితి రావడం బాధాకరం అని, ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.

 

Related posts