telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్ వార్తలు సామాజిక

నిరుపట్టిన శరీరానికి.. చక్కటి చికిత్స.. ఇంట్లోనే..

కొందరికి శరీరం సహజంగా లావుగా అవుతుంది. అది పరిమితిగా ఉన్నంతవరకు ఆరోగ్యమే, మించితేనే సమస్య. ఇక కొందరి శరీరాలు కూడా లావుగా కనిపిస్తాయి, కానీ అది బలం కాదు, ఒంటికి నిరుపట్టి అలా కనిపిస్తారు. అది కూడా ఒక అనారోగ్యమే కాబట్టి దానికి ఒక చికిత్స తప్పనిసరిగా ఉంది. ఈ సమస్య మహిళలలో ఎక్కువగా కనిపిస్తుంది. అటువంటివారు రకరకాల ప్రయత్నాలు చేసి, సాధారణ స్థితికి రావడానికి ప్రయత్నిస్తారు. ఇలాంటి వారు ఇతర ఊబకాయస్తుల మాదిరి, తిండి తగ్గించుకుంటే, కష్టాలు కొని తెచుకున్నట్టే. ఊబకాయం వేరు, నిరుపట్టిన శరీరం వేరు. దేనికి తగ్గ చికిత్స దానికి ఉంటుంది. అయితే నీరు శరీరం ఉన్నవారికోసం ఇక్కడ చిన్న చిన్న ఇంటి చిట్కాలు చూద్దాం…

అల్లం : దీనివలన అనేక ప్రయోజనాలు. అల్లాన్ని మెత్తగా దంచి చిక్కగా రసాన్ని తీసి, దానిలో కొంచెం పాత బెల్లాన్ని కలుపుకుని రోజూ రెండుపూటలా నాలుగు చెంచాలు తీసుకుంటుంటే వంటికి పట్టిన నీరు తగ్గుతుంది.

పిప్పళ్లు : ఇవి కూడా అనేకరకాలైన శారీరక రుగ్మతలకు మంచి ఔషధం. పిప్ళిళ్ళను నేతిలో వేయించి, మెత్తగా దంచాలి. శొంఠిని కూడా నిప్పులమీద కాల్చి, మెత్తగా దంచి, రెంటిని సమానంగా కలిపి, బెల్లంతో నూరి తింటుంటే శరీరానికి నీరు లాగేస్తుంది. కీళ్ళ నొప్పులు, నడుంనొప్పి తగ్గిపోతుంది.

గలిజేరు తీగ : దీని ప్రయోజనాలు కూడా అనేకం. ఇవన్నీ సహజ ప్రకృతిలో లభించేవే. గలిజేరు తీగ పాలంగట్లు మీద పెరుగుతుంది. దీనిని తెచ్చి బాగా ఎండించి, మెత్తగా దంచి, పాలలోగానీ, మజ్జిగలో గానీ కలుపుకుని త్రాగుతుంటే వంటికి పట్టిన నీరులాగేస్తుంది.

నేలవేము : దీనిని బాగా పొడిచేసి, దీనికి సమానంగా శొంఠిని తీసుకుని బెల్లంతో నూరి కుంకుడు గింజలంత మాత్రలు చేసుకుని రెండుపూటలా వేసుకుంటుంటే వంటికి పట్టిన నీరు తగ్గుతుంది.

ఇంకా, పునర్ణవారిష్ట, రోహితకారిష్ట, శాశీసభస్మ మండూరభస్మ, లోహభస్మ, గోక్షురాది చూర్ణం, చంద్ర ప్రభావటి, స్వర్ణవంగం, త్రివంగభస్మ వంటి చాలా మందులు ఆయుర్వేదం మందుల షాపులో దొరుకుతాయి. వీటిని వాడుతున్నా వంటికి పట్టిన నీరు లాగేస్తుంది. ఆయుర్వేదం వలన ఫలితాలు ఖచ్చితంగా ఉంటాయి, కాకపోతే నిదానంగా ఫలితాలు వస్తాయి, ఓపికగా క్రమం తప్పకుండ ఆయా ఔషధాలను వాడుతుండాలి. అప్పుడు మీరనుకున్న ఫలితాలు స్వయంగా చూసుకోవచ్చు.

Related posts