telugu navyamedia
వార్తలు

కరోనా వైరస్ ప్రభావంతో చనిపోతే రూ.4 లక్షల ఎక్స్‌గ్రేషియా

karona

ఎవరైనా కరోనా వైరస్ పాజిటివ్‌గా నిర్ధారణ అయి చికిత్స పొందుతూ చనిపోతే, ఆ వ్యక్తి కుటుంబసభ్యులకు రూ.4 లక్షల ఎక్స్‌గ్రేషియా కేంద్రం ఇవ్వనుంది. ఇప్పటికే భారత్‌లో కరోనా వైరస్ వల్ల రెండు మరణాలు సంభవించిన సంగతి తెలిసిందే. కర్ణాటకు చెందిన ఓ వ్యక్తి సహా దిల్లీలో చికిత్స పొందుతూ ఓ మహిళ కరోనా వైరస్ సోకి చనిపోయారు. కార్పొరేట్ సంస్థలు, ఐటీ కంపెనీలకు కరోనా వైరస్ భయం వెంటాడుతున్న సంగతి తెలిసిందే. ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ దిగ్గజం ఇన్ఫోసిస్‌ ఏకంగా బెంగళూరులోని తన ప్రాంగణాన్నే మొత్తం ఖాళీ చేయించింది. తమ ఉద్యోగికి కరోనా వైరస్‌ లక్షణాలు ఉన్నాయన్న అనుమానంతో భవనం మొత్తాన్ని శుక్రవారం ఖాళీ చేశారు. కరోనా వైరస్ నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలకు తెలంగాణ ప్రభుత్వం నడుం బిగించింది. రాష్ట్రంలో షాపింగ్ మాల్స్, థియేటర్లు, స్కూళ్లు మూసివేసేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెలాఖరు వరకూ ఈ బంద్ వర్తించనున్నట్లు తెలుస్తోంది.

Related posts