telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

గోదావరిలోకి ప్రాణహిత వరద…

కాళేశ్వరం వద్ద గోదావరిలోకి ప్రాణహిత నది వరద చేరుకుంటుంది కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ప్రాజెక్ట్ ద్వారా మూడో సీజన్ లో నీటి ఎత్తిపోతల ప్రారంభం అయింది. ఖరిఫ్ సీజ్ ప్రారంభంలోనే నీటిని తరలించాలనే ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా అధికారులు సిద్దమయ్యారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ లోని కన్నెపల్లి లక్ష్మీ పంపుహౌస్ లోని 17 మోటర్లకు గాను 4 మోటర్లకు ప్రారంభించారు. తొలుత 1 ఆపై 2,5,7 నెంబర్ల మోటర్లు ప్రారంభించగా ఎనిమిది పంపుల ద్వారా నీరు గ్రావిటీ కాల్వలో ఎత్తిపోస్తున్నారు. ఆ ఎత్తిపోసిన నీరు అన్నారం బ్యారేజీకి తరలుతుంది. ప్రస్తుతం గోదావరిలో 5.54 మీటర్ల మేర నీటి మట్టం పెరిగింది. మరో రెండు రోజుల్లో నీటి మట్టం పెరిగే అవకాశాలు ఉండటంతో లక్ష్మి పంపుహౌస్ ద్వారా నీటి ఎత్తిపోతల ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు.

Related posts