telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

జీహెచ్‌ఎంసీ లో ఎక్కువ మంది నేరస్థులకు టికెట్ ఇచ్చిన పార్టీ..

ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్న గ్రేటర్ వార్ లో పోటీ చేస్తున్న నేర చరిత్ర కలిగిన అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్.   మొత్తం 49 మంది అభ్యర్థులపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. 49 మందిపై మొత్తం 96 కేసులు నమోదు చేశారు పోలీసులు. వీరిలో   43 మంది పురుషులు, ఆరుగురు మహిళలు.  బీజేపీ 17, కాంగ్రెస్ 12, టీఆర్‌ఎస్ 13, ఎంఐఎం అభ్యర్థులపై 7 కేసులు నమోదయ్యాయి. అంటే మొత్తంగా అందరికంటే ఎక్కువ మంది నేర చరితులకి టికెట్ ఇచ్చిన పార్టీగా బీజేపీ నిలిచింది. బల్దియా ఎన్నికల్లో పోటీ చేస్తున్న నేరచరితుల లిస్ట్ ని ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెస్ విడుదల చేసింది. పోటీలో ఉన్న నేర చరిత్ర గల అభ్యర్థులు 49 మంది ఉన్నారు. వారిపై నమోదైన కేసుల సంఖ్య 96గా ఉంది. నేరచరిత్ర కలిగిన మహిళ అభ్యర్థులు కూడా 6 గురు ఉండడం గమనార్హం. నేర చరిత్ర కలిగిన అభ్యర్థులు మొత్తం 41 వార్డులో పోటీ చేస్తున్నారు. మల్కాజిగిరి డివిజన్ లో ప్రధాన పార్టీలన్నీ కూడా నేర చరిత్ర ఉన్న వారికి టికెట్ కేటాయించడం ఆసక్తికరంగా మారింది. ఇక గత ఎన్నికల్లో 72 మంది నేర చరిత్రులకు టికెట్ ఇస్తే ఈ సారి కేవలం 49 మందికి మాత్రమే ఇవ్వడం శుభ పరిణామం అని చెబుతున్నారు విశ్లేషకులు. చూడాలి మరి ఆ నేరస్థులకు ప్రజలు పట్టం కడుతారా.. లేదా అనేది.

Related posts