telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

రాష్ట్రాల మధ్య.. చార్జీల మోత ప్రభావం తక్కువే..

no rtc charges effect between telugu states

విజయవాడ, విశాఖపట్టణంతం, తిరుపతి, కడప, అనంతపురం ప్రాంతాలకు తెలంగాణ ఆర్టీసీ బస్సు సర్వీసుల్ని నడపుతోంది. ఇలాంటి సర్వీసుల్లో ఏపీ బస్సుల కంటే ఛార్జీలు తెలంగాణ బస్సులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. రెండు రాష్ట్రాల బస్సులు ఒకే రూట్లో తిరిగినప్పుడు రెండు రాష్ట్రాల బస్సుల్లో చార్జీలతో బాగా తేడా తెలుస్తోంది. అలాంటప్పుడు ఏపీ బస్సుల్ని ప్రయాణికులు ఎంచుకునే అవాశం ఉంది. బస్సు ఛార్జీలు కిలోమీటర్‌కు 20 పైసలు పెరగనుండటమే ఇందుకు కారణం.

ఏపీ బస్సుల్లో ప్రయాణమే జనం చౌకగా భావించే అవకాశం ఉంది. తెలంగాణ బస్సు ఛార్జీల పెంపు ప్రభావం ఏపీ ప్రజలపైనా పడే అవకాశం ఉంది. ప్రస్తుతం రెండు రాష్ట్రాల మధ్య నడిచే ఆర్టీసీ బస్సుల్లో ఛార్జీలు దాదాపుగా సమానంగా ఉన్నాయి. ఇప్పుడు దీన్ని బ్యాలెన్స్ చేయడానికి రెండు రాష్ట్రాల మధ్య బస్సుల రవాణాకు సంబంధించి ప్రభుత్వాల మధ్య అవగాహన కుదిరే అవకాశం ఉందని సమాచారం. టీఎస్ఆర్టీసీ నుంచి కేవలం మూడు బస్సులే ఉన్నందున వాటిలో ఎక్కువగా పెంచబోరని, ఏపీ బస్సులతో పోల్చి చూసుకుని అతి తక్కువ వ్యత్సాసం ఉండేలా అధికారులు నిర్ణయించే అవకాశం ఉందని ఏపీఎస్ ఆర్టీసీ వర్గాలు చెబుతున్నాయి.

Related posts