telugu navyamedia
రాజకీయ

యూరప్‌లో అతిపెద్ద పవర్ ప్లాంట్‌పై రష్యా దాడి …

*ఉక్రెయిన్ యుద్ధంలో అతిపెద్ద దాడి..
*అణు విద్యుత్ ప్లాంట్‌పై రష్యా సైన్యం కాల్పులు..
*నూక్లియ‌ర్ ప్లాంట్‌లో ఎగిసిప‌డుతున్న మంట‌లు..
*పేలితే చెర్నోబిల్ కంటే 10 రెట్లు అధిక ప్రమాదం.

ఉక్రెయిన్‌పై రష్యా గత వారం రోజులనుంచి క్షిపణులు, బాంబు దాడులతో విరుచుకుపడేతోంది. అంతర్జాతీయంగా పలు దేశాలు రష్యాపై ఆంక్షలు విధిస్తున్నప్పటికీ పుతిన్ మాత్రం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడం లేదు.

ఉక్రెయిన్ రాజధాని కీవ్ నగరాన్ని సొంతం చేసుకునేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తోంది రష్యా. ఈ క్ర‌మంలో ఉక్రెయిన్‌లో ఉన్న యూరప్ లోని అతిపెద్ద అణు విద్యుత్ కేంద్రంపై రష్యా బలగాలు బాంబుల వర్షం కురిపిస్తున్నాయి.

రష్యా దాడులతో శుక్ర‌వారం తెల్ల‌వారుజామున న్యూక్లియర్ పవర్ ప్లాంటులో మంటలు చెలరేగాయి. దెబ్బతిన్న పవర్ స్టేషన్ నుండి రేడియేషన్ లీక్ అవుతుందనే ఆందోళ‌నలో అక్క‌డ పౌరులు ఉన్నారు. 

File photo of Europe's largest nuclear power plant in Ukraine

ఈ విషయాన్ని స్థానిక అధికారులు మీడియాకు తెలిపుతూ ఓ వీడియో సైతం సోషల్ మీడియాలో షేర్ చేశారు. ..రష్యన్ సేనలు దాడులు ఆపకపోతే పెను విధ్వంసం తప్పదని అంతర్జాతీయ అణు విద్యుత్తు కేంద్రం ప్రతినిధి హెచ్చరించారు.

అణు విద్యుత్ కేంద్రం పేలినట్లయితే..దాని ప్రభావం చెర్నోబిల్ పేలుడు కంటే 10 రెట్లు నష్టం వాటిల్లే అవకాశం ఉందని ఉక్రెయిన్​ విదేశాంగ శాఖ మంత్రి దిమిత్రో కులేబా ఆందోళన వ్యక్తం చేశారు.

Related posts