ఉక్రెయిన్ నగరాలపై రష్యా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ యుద్ధంలో.. మరో భారత విద్యార్థికి బుల్లెట్ తగిలింది. కైవ్ లో ఉన్న భారతీయ విద్యార్థికి తూటా తగిలి తీవ్ర గాయం కాగా.. వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారని కేంద్ర మంత్రి వీకే సింగ్ తెలిపారు.
ఈ రోజు కైవ్ నుంచి వస్తున్న విద్యార్థిపై కాల్పులు జరిపి.. తిరిగి కైవ్‌కు తీసుకెళ్లినట్లు తెలిసిందని అన్నారు. ఇప్పటికే ఈ దాడుల్లో ఓ భారతీయ విద్యార్థి ప్రాణాలు కోల్పోగా.. తాజాగా మరొకరు ఆ దేశ రాజధాని కీవ్‌లో జరిగిన ఘర్షణల్లో మరో భారత విద్యార్థికి బుల్లెట్ తగిలింది. తీవ్ర గాయాలైన విద్యార్థిని ఆసుపత్రికి తరలించారు.
ఇప్పటికే కీవ్‌ను వదిలి సురక్షిత ప్రాంతానికి వెళ్లాలని భారత రాయబార కార్యాలయం హెచ్చరించింది. యుద్ధ సమయంలో తూటాలకు ఏ ప్రాంతం, ఏ దేశం అనేవి కనిపించవు అని తెలిపింది.