telugu navyamedia
తెలంగాణ వార్తలు

ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరేన్ తో సీఎం కేసీఆర్ భేటి..

ముఖ్యమంత్రి కేసీఆర్​… ఝార్ఖండ్ రాజధాని రాంచీకి ఇవాళ వెళ్లనున్నారు. జాతీయ రాజకీయాల్లో మార్పులు తేవాలని వివిధ పార్టీల నేతలతో ఆయన సమావేశం అవుతున్నారు. ఈ క్ర‌మంలో ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరేన్ తో భేటి కానున్నారు.

భారత్ – చైనా సరిహద్దులోనీ గల్వాన్ వాలీ లో జరిగిన హింసాత్మక ఘర్షణ లో ప్రాణాలు కోల్పోయిన ఝార్ఖండ్ కు చెందిన ఇద్దరు అమర జవాన్ల కుటుంబాలను ఆర్థిక సాయం అందించనున్నారు.

ఢిల్లీ నుంచి రాంచీ వెళ్లి.. ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరేన్ తో కలిసి, వారి అధికారిక నివాసంలో చెక్కులను అందించనున్నారు. ఇద్దరు అమరుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పు చెక్కులను అందజేయనున్నారు.

అమ‌రుల కుటుంబాల‌కు ప‌రిహారం..

2020 జూన్ 15న చైనా సైనికులతో జరిగిన ఘర్షణల్లో మనదేశానికి చెందిన 20 మంది సైనికులు వీరోచితంగా పోరాడి అమరులయ్యారు. రాష్ట్రానికి చెందిన కల్నల్ సంతోష్​బాబు సహా మరో 19 మంది వీరమరణం పొందారు. సంతోష్ బాబుతో పాటు అమరులందరికీ తెలంగాణ ప్రభుత్వం పరిహారం ప్రకటించింది.

సంతోష్ బాబుకు ఐదు కోట్ల రూపాయలు, మిగతా 19 మంది సైనికుల కుటుంబాలకు పది లక్షల రూపాయల చొప్పున ఆర్థికసాయాన్ని ప్రకటించారు. గతంలోనే సూర్యాపేటలోని సంతోష్​బాబు ఇంటికి వెళ్లిన ముఖ్యమంత్రి కేసీఆర్.. పరిహారంతో పాటు సంతోష్​బాబు సతీమణికి ఉద్యోగ నియామక పత్రాలు అందించారు.

అమరులైన వారిలో బిహార్​కు చెందిన వారు ఐదుగురు, పంజాబ్ నుంచి నలుగురు, ఒడిశా, ఝార్ఖండ్, పశ్చిమబంగాల్‌నుంచి ఇద్దరు చొప్పున ఉన్నారు. హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, తమిళనాడు నుంచి ఒక్కొక్కరు ఉన్నారు.

Related posts