telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

మహారాష్ట్రలో విజృంభిస్తున్న కరోనా.. కొత్త‌గా మ‌రో 165 కేసులు న‌మోదు

corona

మహారాష్ట్రలో కరోనా మహమ్మారి చాపాకింద నీరులా విజృంభిస్తోంది. దీంతో అక్కడ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుంది. కొత్త‌గా మ‌రో 165 కేసులు న‌మోదుకావ‌డంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 3,089కి చేరింది. కొత్త‌గా న‌మోదైన 165 కేసుల్లో ముంబైకి చెందిన వారే 107 మంది ఉన్నార‌ని అధికారులు తెలిపారు.

రాష్ట్రంలోని ఔరంగాబాద్‌లో ఇద్దరికి కరోనా సోకిందని వెల్లడించారు. అతిపెద్ద మురికివాడ అయిన‌ ధారావిలో పరిస్థితి ఇంకా అదుపులోకి రాలేదు. గత 24 గంటల్లో అక్క‌డ తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. లాక్ డౌన్ అమలవుతున్న నేపథ్యంలో బాంద్రా రైల్వేస్టేషన్ ముందు రెండు వేల మంది గుమిగూడిన ఘటనలో 9 మందిని అరెస్ట్ చేసిన‌ట్లు పోలీసులు తెలిపారు.

Related posts