telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

విక్రమ్ ల్యాండర్ ఆచూకీ .. కనుగొన్న నాసా..

nasa found vikram lander on moon

నాసా కు విక్రమ్ ల్యాండర్ ఆచూకీ చిక్కింది. చంద్రుడి ఉపరితలంపై ఉన్న విక్రమ్ శిథిలాలను నాసా గుర్తించింది. దానికి సంబంధించిన దృశ్యాలను నాసా సంస్థ తన ట్విట్టర్‌లో పోస్టు చేసింది. చంద్రయాన్‌2 ద్వారా విక్రమ్ ల్యాండర్‌ను ప్రయోగించిన విషయం తెలిసిందే. అయితే సెప్టెంబర్ 7వ తేదీన చంద్రుడిపై ల్యాండింగ్ సమయంలో విక్రమ్ అదుపు తప్పింది. దాంతో ఆ ల్యాండర్ ఆచూకీ మిస్సైంది. అమెరికాకు చెందిన స్పేస్ ఏజెన్సీ నాసా.. ఇవాళ విక్రమ్‌కు సంబంధించిన చిత్రాలను రిలీజ్ చేసింది. లూనార్ రికయినసెన్స్ ఆర్బిటార్‌(ఎల్ఆర్‌వో) తీసిన ఫోటోల్లో విక్రమ్ కనిపించింది. అది కూలిన ప్రాంతాన్ని నాసా ఆర్బిటార్ చిత్రీకరించింది. విక్రమ్ శిథిలాలు అక్కడే ఉన్నాయి.
(ఫోటో సూచన.. గ్రీన్ కలర్ డాట్స్‌.. విక్రమ్ శిథిలాలు బ్లూ కలర్ డాట్స్‌.. శిథిలాల వల్ల దెబ్బతిన్న చంద్రుడి ఉపరితలం)

Related posts