telugu navyamedia
వార్తలు సామాజిక

యూటీఎస్‌ మొబైల్‌ యాప్‌.. క్యూఆర్‌ కోడ్‌ తో రైల్వే టికెట్లు!

special train between vijayawada to gudur

కాగిత రహిత సేవల లక్ష్యంగా దక్షిణ మధ్య రైల్వే ఇటీవల యూటీఎస్‌ మొబైల్‌ యాప్‌ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. సాధారణ ప్రయాణమైనా స్టేషన్‌కి వెళ్లి, క్యూలో నిల్చుని టికెట్‌ తీసుకునే అవస్థలు లేకుండా క్యూఆర్‌ కోడ్‌ (క్విక్‌ రెస్పాన్స్‌) విధానంలో జనరల్‌ టికెట్లు తీసుకునే సదుపాయాన్ని దక్షిణ మధ్య రైల్వే అమల్లోకి తెచ్చింది.

ఈ యాప్‌ ఉన్న వారు, స్టేషన్‌కు కిలోమీటర్‌ పరిధిలో ఉన్న వారు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు. దీనిద్వారా ఇప్పటి వరకు రిజర్వ్‌డ్‌ ప్రయాణికులకే సదుపాయం అందుబాటులో ఉండగా, తాజాగా సాధారణ ప్రయాణికులకు వర్తింపజేసింది. దీనివల్ల టికెట్‌ తీసుకునేలోగా రైలు వచ్చేస్తుందేమో అన్న ఆందోళన ప్రయాణికులకు ఇకపై ఉండదు.

Related posts