టీడీపీ నేత, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ రిమాండ్ ను కోర్టు పొడిగించింది. ఈ మధ్యాహ్నం ఆయనను ఏలూరు జిల్లో కోర్టులో పోలీసులు ప్రవేశపెట్టారు. ఈ క్రమంలో ఆయన రిమాండ్ ను నవంబర్ 6వ తేదీ వరకు కోర్టు పొడిగించింది. ఆయనను పోలీసులు ఏలూరులోని జిల్లా జైలుకు తరలించారు.
పినకడిమికి చెందిన జోసెఫ్ ను తనపై పెట్టిన కేసును వాపసు తీసుకోవాలని బెదిరించారంటూ చింతమనేనిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసు వ్యవహారంలో ఆయన ఇప్పటికే రిమాండ్ లో ఉన్నారు. రిమాండ్ గడువు పూర్తైన నేపథ్యంలో, ఆయనను పోలీసులు మరోసారి కోర్టు ముందు హాజరుపరిచారు. ఈ క్రమంలో ఆయన రిమాండ్ ను పొడిగిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.