దేశవ్యాప్తంగా దసరా ఉత్సవాలు అట్టహాసంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల ముగింపులో రావణ దహనం కీలకమైన ఘట్టం. రావణ దహనం కోసం చండీఘడ్ లో దేశంలోనే అత్యంత భారీ రావణాసురుడి బొమ్మను తయారు చేశారు. ధనాస్‌లోని గడ్డా మైదానంలో 221 అడుగుల ఎత్తున్న బొమ్మను రావణ దహనం కోసం తయారు చేశారు.
తొమ్మిది రోజులు ఎంతో వేడుకగా జరిగిన దసరా శరన్నవరాత్రులు రావణ దహనంతో ముగుస్తాయి. ఈ వేడుకల కోసం 221 అడుగుల ఎత్తున్న రావణుడి దిష్టిబొమ్మను తయారు చేశారు నిర్వాహకులు. కేవలం ఆరు నెలల్లోనే తయారు చేశారు. దీన్ని తయారీలో 40 మంది కార్మికులు పనిచేశారు.
శ్రీరెడ్డిని టార్గెట్ చేస్తూ అదిరిపోయే కౌంటర్ ఇచ్చిన మాధవిలత