telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఆగష్టు లో .. ఢిల్లీ కి ఏపీసీఎం.. రాష్ట్రం గురించి మరోమారు వినతులు..

jagan

ఏపీ సీఎం జగన్ ఆగస్టు 6, 7 తేదీల్లో ఢిల్లీలో పర్యటించనున్నారు. జగన్ తన పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీని, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, హోం శాఖ మంత్రి అమిత్ షాను కలవనున్నారు. రాష్ట్ర సమస్యలు, పెండింగ్ లో ఉన్న అంశాల గురించి, ఆర్థిక సాయం గురించి వారి దృష్టికి తేనున్నట్టు సమాచారం. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతిని కూడా జగన్ కలిసే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.

ఇప్పటికే కేంద్ర నేతలు, ప్రధాన మంత్రి సహా ఎవరు తారసపడ్డా కూడా రాష్ట్ర సమస్యలను ఏకరవుపెడుతూనే ఉన్నాడు జగన్. దానికి అప్పటికైతే సానుకూలంగానే ఉన్నట్టు వాళ్ళు జవాబు చెప్పుకుపోవటం పరిపాటి అయ్యింది. అయినా ఏపీలో ప్రభుత్వం ఏర్పాటు చేసి మూడు నెలలు కూడా కాకపోయినా ఇప్పటికే మార్లు రాష్ట్రం గురించి కేంద్రానికి జగన్ వివిధ రూపాలలో విన్నవిస్తూనే ఉన్నాడు. బహిరంగంగా కేంద్ర నాయకులు ఏపీకి విముఖంగా సమాదానాలు ఇస్తున్నప్పటికీ, తెరవెనుక మరోవిధంగా జరుగుతుందనే విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Related posts