telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

134 పరుగులకే చాప చుట్టేసిన ఇంగ్లండ్‌

చెన్నై వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో రెండో రోజు రెండో సెషన్ పూర్తయింది. అయితే ఈ మ్యాచ్ పై ఇప్పటికే భారత్ పట్టు బిగించింది. అయితే మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 329 పరుగులకు ఆల్ ఔట్ అయింది.  అంతకు ముందు 300 పరుగుల ఓవర్‌ నైట్‌ స్కోర్‌తో బ్యాటింగ్‌ ప్రారంభించిన భారత్… 329 పరుగులకు ఆలౌటైంది. ఈరోజు ఆట ప్రారంభమైన తర్వాత కేవలం 29 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. ఇది ఇలా ఉండగా..తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌ను 134 పరుగులకే ఆలౌట్‌ చేసింది టీం ఇండియా. మొదటి నుంచి ఇంగ్లండ్‌ బ్యాట్స్‌మెన్స్‌పై ఒత్తిడి తెచ్చిన టీం ఇండియా బౌలర్లు… 134 పరుగులకే ఇంగ్లండ్‌ను ఆలౌట్‌ చేశారు. తొలి ఇన్నింగ్స్‌లో అశ్విన్‌ 5 వికెట్లు, ఇషాంత్‌, అక్షర్‌ పటేల్‌కు చెరో రెండు వికెట్లు పడగొట్టారు. ఆల్‌రౌండర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ ఏకంగా 5 వికెట్లు తీసి.. ఇంగ్లండ్‌ టీం నడ్డి విరిచాడు. అయితే.. ఈ మ్యాచ్‌లో ఫాలో ఆన్‌ తప్పించుకుంది ఇంగ్లండ్‌. ఇక భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం 195 రన్స్‌ సంపాదించుకుంది. కాగా.. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 329 పరుగులకు ఆలౌట్‌ అయిన విషయం తెలిసిందే. 

Related posts