telugu navyamedia
క్రీడలు వార్తలు

అప్పుడు భారత్ కు… ఇప్పుడు ఇంగ్లాండ్ కు

నిన్న జరిగిన నాలుగో టీ 20 మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్‌ కు కారణమైన ఇంగ్లండ్ జట్టుపై మ్యాచ్ రిఫరీ జవగళ్ శ్రీనాథ్ చర్యలు తీసుకున్నాడు. ఇంగ్లండ్ ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 20 శాతం కోత విధిస్తూ జరిమానా విధించాడు. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ టీమ్ నిర్దిష్ట సమయానికి ఒక ఓవర్ తక్కువగా వేసింది. ఈ తప్పిదాన్ని ఇంగ్లండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ అంగీకరించడంతో ఎలాంటి తదుపరి విచారణ లేకుండా మ్యాచ్ రిఫరీ చర్యలు తీసుకున్నాడు. అయితే ఐసీసీ నిబంధనల్లోని ఆర్టికల్ 2.22 ప్రకారం నిర్థిష్ట సమయానికన్నా తక్కువగా ఓవర్లు వేస్తే ఒక్కో ఓవర్ చొప్పున ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 20 శాతం కోత విధిస్తారు. ఇక ఇదే సిరీస్‌ రెండో టీ20లో టీమిండియాకు కూడా స్లో ఓవర్‌ రేట్‌ కారణంగా మ్యాచ్‌ ఫీజులో కోత పడిన విషయం తెలిసిందే. ఇక తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో టీమిండియా 8 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను ఓడించి సిరీస్ రేసులో నిలిచింది. దాంతో ఐదు మ్యాచ్ ల ఈ సిరీస్ లో 2-2 తో సమానంగా నిలిచిన జట్లు ఇక నిర్ణయాత్మకమైన ఆఖరి మ్యాచ్‌ అహ్మదాబాద్ వేదికగానే రేపు ఆడనున్నాయి.

Related posts