telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు సామాజిక

తెలంగాణ ఎన్జీవో కేంద్ర సంఘం ఆధ్వర్యంలో .. ఘనంగా క్రిస్మస్ వేడుకలు …

Christmas celebrations in tngo

తెలంగాణ ఎన్జీవో కేంద్ర సంఘం ఆధ్వర్యంలో నాంపల్లిలోని టీఎన్జీవో భవన్ లో క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆబ్కారి, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖా మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. కేక్ కట్ చేసి క్రిస్టమస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి క్రిస్మస్ కానుకలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ..రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసిఆర్ నేతృత్వంలో క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించడంతోపాటు పేద ప్రజలందరికి దుస్తులు, క్రిస్మస్ కిట్లను పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. టీఎన్జీవో తెలంగాణ సంస్కృతులను కాపాడుతూ అన్ని మతాలకు సంబంధించిన పండుగలను ఘనంగా నిర్వహించడాన్ని మంత్రి అభినందించారు.

తెలంగాణ ప్రభుత్వంలో అన్ని పండుగలకు సమాన ప్రాముఖ్యతను ఇస్తున్నది. ఒక్కప్పటి పాలనకు ఇప్పటి పాలనకు చాలా తేడా ఉందన్నారు. సర్వమతాలను కలుపుకుపోయేది తెలంగాణ ప్రభుత్వానిదన్నారు. కోకాపేటలో విలువైన భూమిని క్రిస్టియన్ ల సంక్షేమం కోసం క్రిస్టియన్ భవన్ కు ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ ప్రభుత్వం కేటాయించిందన్నారు. మహబూబ్ నగర్ లో క్రైస్తవ భవన్ కు శంకుస్థాపన చేస్తున్నాం. తెలంగాణా వచ్చాక చెడు పోయి మంచి వచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బెవరేజెస్ కార్పోరేషన్ చైర్మన్ శ్రీ దేవిప్రసాదరావు, టీఎన్జీవో రాష్ట్ర నేతలు రామినేని శ్రీనివాసరావు, కస్తూరి వెంకటేశ్వర్లు , కొండల్ రెడ్డి, ఉమ, దివ్య, హైదరాబాద్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ముజీబ్, ప్రభాకర్, సిటీ అధ్యక్ష కార్యదర్శులు ప్రతాప్, శ్రీకాంత్, సంగారెడ్డి అధ్యక్షులు సుశీల్ బాబు, టిఎన్జీవో నేతలు పాల్గొన్నారు.

Related posts