telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు సామాజిక

అదుపు తప్పితే ఆపగలిగే పరిస్థితులు లేవు: విజయశాంతి

Congress vijayashanti comments Modi Kcr

ప్రపంచ వ్యాప్తంగా కరోన వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మహిళా నేత, సినీ నటి విజయశాంతి స్పందించారు. ఇండియా వైద్య పరంగా ఇటలీ, అమెరికా, స్పెయిన్ దేశాలకన్నా గొప్పదేమీ కాదని ఆమె తెలిపారు. ఆ దేశాలే అల్లాడిపోతున్న వేళ, ఇండియాలో పరిస్థితి అదుపు తప్పితే, ఆపే పరిస్థితి ఉండబోదని హెచ్చరించారు. ఈ మేరకు తన ఫేస్ బుక్ ఖాతాలో పెట్టిన ఓ ట్వీట్ లో ప్రజలు ఆలోచించాలని సలహా ఇచ్చారు.”మనం ఇటలీ, అమెరికా, స్పెయిన్ లాంటి చాలా దేశాలకన్నా వైద్యపరంగా గొప్పోళ్లం ఏమీ కాదు. అజాగ్రత్తతో వచ్చిన పరిణామాల వల్ల తక్కువ జనాభా ఉన్న ఆ దేశాలు కూడా అల్లాడిపోతున్నాయని పేర్కొన్నారు.

మన దేశంలో అదుపు తప్పితే, ఆపగలిగే పరిస్థితులు లేవు. పంజాబ్ ఎందుకు కర్ఫ్యూ విధించిందో ఆలోచించాలి. మన రాష్ట్రాలలో కూడా అంతకన్నా తీవ్ర పరిస్థితులు ఏర్పడుతున్నాయి. తెలంగాణలో ఇప్పటికే కరోనా బాధితుల సంఖ్య 33 దాటింది. వైరస్ వ్యాప్తి ప్రారంభం కావడం ప్రస్తుత పరిస్థితిని ఎంతో ఆందోళనకరంగా మార్చింది. ప్రజలారా ఆలోచన చెయ్యండి. వివేకంతో వ్యవహరించండి..మీ విజయశాంతి” అంటూ ఫేస్ బుక్ లో పేర్కొన్నారు.

Related posts