telugu navyamedia
వార్తలు సామాజిక

ఇక్కడ స్వలింగ సంపర్కులను రాళ్లతో కొట్టి చంపేస్తారట…!?

Gay

ఇటీవలే భారతదేశంలో స్వలింగ సంపర్కుల విషయమై సానుకూల తీర్పును ఇచ్చింది సుప్రీమ్ కోర్టు. అయితే ఆసియాలోని బ్రూనై దేశంలో మాత్రం స్వలింగ సంపర్కులను రాళ్లతో కొట్టి చంపేస్తారట. ఇక్కడ స్వ‌లింగ సంప‌ర్కుల‌ను రాళ్ల‌తో కొట్టి చంపాల‌ని బ్రూనై దేశం కొత్త ఇస్లామిక్ చ‌ట్టాల‌ను రూపొందించింది. ఆ దేశంలో ఈరోజు నుంచి ఈ చ‌ట్టం అమ‌లులోకి రానున్న‌ది. దొంగ‌త‌నానికి పాల్ప‌డిన వ్య‌క్తుల‌కు కూడా కఠినమైన శిక్ష‌ను విధించాలని ఆ దేశం నిర్ణ‌యించింది. దీంతో బ్రూనై తీరు ప‌ట్ల ప్ర‌పంచ‌దేశాలు తీవ్ర ఆక్షేప‌ణ వ్య‌క్తం చేస్తున్నాయి. ఆగ్నేయాసియా దేశ‌మైన బ్రూనైలో ప్ర‌స్తుతం సుల్తాన్ల పాల‌న కొన‌సాగుతున్న‌ది. ఇస్లామిక్ మ‌త నియ‌మాల‌ను బ‌లంగా అమ‌లు చేయాల‌ని ఇటీవ‌ల సుల్తాన్ హ‌స‌న‌ల్ బోల్కియా తెలిపారు. బ్రూనైలోని గే వ‌ర్గీయులు సుల్తాన్ ఆదేశాల ప‌ట్ల ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

Related posts