telugu navyamedia
ట్రెండింగ్ రాశి ఫలాలు సామాజిక

రాశిఫలాలు : .. తొందరనిర్ణయాలు వద్దు.. ప్రయాణాలలో జాగర్త అవసరం…

today rasi falalu

మేషం : ఈ రోజు ఆర్థికంగా కొంత సామాన్యంగా ఉంటుంది. అనుకోని ఖర్చుల కారణంగా కొంత ఇబ్బందికి గురయ్యే అవకాశముంటుంది. అలాగే విలువైన వస్తువుల విషయంలో, నగల విషయంలో జాగ్రత్త అవసరం. అజాగ్రత్తగా ఉండకండి.

వృషభం : ఈ రోజు మీకు ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. ధన లాభం కలుగుతుంది. ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీఅనుకూల పరిస్థితులు ఏర్పడుతాయి. చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్న పనులు పూర్తవుతాయి.

మిథునం : ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ అభివృద్ధి కొరకుచేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయి. మీప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగంలో ప్రమోషన్‌లో కానీ, అనుకున్న మార్పు కానీ చోటు చేసుకుంటుంది. పెట్టుబడులు పెట్టడానికి అనుకూల దినం. అలాగే పైఅధికారులతో మీసంబంధాలు మెరుగవుతాయి.

కర్కాటకం : పాతమిత్రులను కానీ, దూరదేశంలో ఉన్న మిత్రులను కానీ కలుసుకుంటారు. ఆర్థిక వ్యవహారాలలో జాగ్రత్త అవసరం. మీరు అనుకున్న దానికన్నా ఎక్కువ డబ్బు ఖర్చయ్యే అవకాశముంటుంది. అలసట, ఒత్తిడి అధికంగా ఉంటాయి.

సింహం : ఈ రోజు మానసికంగా కొంత ఆందోళనకు గురవుతారు. చేపట్టిన పనులు, ప్రయాణాలు వాయిదా పడుతాయి. అనవసర ఖర్చుపైన పడుతుంది. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకండి. పెట్టుబడులకు అనువైన రోజుకాదు.

కన్య : స్నేహితులతో, జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు. రుచికరమైన ఆహారం, వినోద కార్యక్రమాలతో రోజు గడుపుతారు. అలాగే వాహనం కొనుగోలు కానీ, భూసంబంధ వ్యవహారాలు కానీఒక కొలిక్కి వస్తాయి. వినోదయాత్ర చేస్తారు.

తుల : ఈ రోజు గృహసంబంధ వ్యవహారాల్లో మునిగి తేలుతారు. ఇంటికి సంబంధించిన వస్తువులు కొనడం కానీ, వాహనం కొనుగోలు చేయడం కానీ చేస్తారు. ఆరోగ్యం విషయంలోజాగ్రత్త అవసరం. అత్యుత్సాహానికి పోకండి.

వృశ్చికం : మీరు ఎంతో ఇష్టంతో చేపట్టిన పని వాయిదా పడటం, అలాగే సాయం చేస్తా అన్నవారు కూడా సమయానికి మాట మార్చటంతోమానసికంగా ఆందోళనకు, అసహనానికి గురవుతారు. పెట్టుబడులకు, పోటీలకు అనువైన రోజు కాదు. మానసిక ప్రశాంతత కొరకు పిల్లలతోగడపటం కానీ, వినోద కార్యక్రమాల్లో పాల్గొనటం కానీ చేయటం మంచిది.

ధనుస్సు : ఆరోగ్యం విషయంలో ఈ రోజు కొంత జాగ్రత్త అవసరం. కడుపు నొప్పి కానీ, ఛాతిలో మంటతో కానీ బాధపడే అవకాశముంటుంది. ఆహారం విషయంలో జాగ్రత్త అవసరం. బయటిభోజనం చేయకండి. అలాగే మీ కుటుంబ సభ్యుల్లో ఒకరి ఆరోగ్యంకూడా మీకు ఆందోళన కలిగించే అవకాశం ఉన్నది.

మకరం : మీ అజాగ్రత్త, అనాలోచిత ప్రవర్తన కారణంగా మీబంధువులను అసహనానికి గురిచేసిన వారవుతారు. వారి నమ్మకాన్ని కోల్పోకుండా జాగ్రత్త పడండి. తొందరపడి నిర్ణయం తీసుకోకండి. అలాగే ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.

కుంభం : ఇతరులతో మాట్లాడేటప్పుడు కొంత జాగ్రత్త అవసరం. మీ మాటతీరు కారణంగా అనవసరపు వివాదాలు తలెత్తే అవకాశముంటుంది. అలాగే ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చకండి. ఆ సమస్యమీకు చుట్టుకుంటుంది. మానసికంగా దృఢంగా ఉండటం మంచిది. దాని వలన మీ ప్రతిష్టకు భంగం కలుగకుండా ఉంటుంది.

మీనం : స్నేహితులతో, పరిచయస్తులతో గడపటానికి అనువైన సమయమిది. అలాగే మీ జీవిత భాగస్వామి నుంచి అనుకోని సాయం లభిస్తుంది. మీ మధ్య ఉన్న మనస్పర్దలు తొలిగిపోతాయి. మీ ప్రేమ వ్యవహారాల్లో కొంత అనుకూల వాతావరణం ఏర్పడుతుంది.

Related posts