telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఆడపిల్లలు మరియు మహిళల కోసమే .. వైఎస్సార్‌ కిశోర పథకం ..

ysr kishora scheme launched today

ఏపీసీఎం జగన్ ఆడపిల్లలు మరియు మహిళలకు ఎప్పుడు పూర్తి రక్షణ,స్వేచ్ఛ ఉండాలి ఎప్పుడు ఆకాంక్షించేవారు. దానికి అనుగుణంగానే ‘వైఎస్సార్‌ కిశోర పథకం’ అనే పేరుతో రూపొందించి, లాంఛనంగా ప్రారంభించారు .ఈ పథకాన్ని హోంమంత్రి అయిన మేకతోటి సుచరిత మరియు స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి అయిన తానేటి వనిత గురువారం నాడు లాంఛనంగా ప్రారంభించారు. పథకం లాంచ్ అనంతరం, హోంమంత్రి సుచరిత మీడియాతో మాట్లాడుతూ, మహిళలకు పూర్తి భద్రత కల్పించాలనేదే సీఎం జగన్ ఎప్పుడు ఆకాంక్షించేవారని, అదే ఈ పథకం యొక్క ముఖ్య లక్ష్యమని కూడా వ్యాఖ్యానించారు. ఏపీలో మహిళలకు 50 శాతం అవకాశాలు ఇస్తున్న వ్యక్తి ఒక్క సీఎం జగన్ అని చెప్పారు. పలు సైబర్ నేరాలు అరికటేందుకు ప్రభుత్వం ఎప్పుడు కృషి చేస్తోందని తెలిపారు. స్మార్ట్ ఫోన్‌లు అనర్ధాలకు కూడా దారి తీస్తున్నాయని ఒత్తిడితో సహా స్మార్ట్ ఫోన్‌ వల్ల అనేక సమస్యలను యువత కొని తెచ్చుకుంటున్నారని పేర్కొన్నారు.

మద్యంపై వచ్చే ఆదాయం కోసం ఆలోచించకుండా, కేవలం మహిళల కోసం సీఎం జగన్ మద్య నిషేధం వైపు చర్యలు చేపట్టనున్నారు అని మంత్రి వనిత పేర్కొన్నారు. ప్రతి వ్యక్తి తన జీవితంలో బాల్యంలో తమ తల్లిదండ్రులు చెప్పినట్లుగా వినాలి, అలాగే యవ్వనంలో తల్లిదండ్రులను మాయ చేయకుండా వాళ్ళను సంప్రదించి, నిర్ణయాలు తీసుకోవాలి అని చెప్పారు. యవ్వనంలో వ్యక్తిగత పరిశుభ్రత అనేది చాలా ముఖ్యమని, ఉమ్మడి కుటుంబాలు ఇప్పుడు లేకపోవటం వలన మన వ్యవస్థపై దుష్ప్రభావం పడుతుంది అని తన అభిప్రాయం పంచుకున్నారు. ఇప్పటి పరిస్థితుల వల్ల సొసైటీలో గుడ్ టచ్, బ్యాడ్ టచ్‌లను గుర్తించి ఇబ్బంది ఎదురు పడిన వెంటనే తమ పెద్దలకు సమాచారం ఇవ్వాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌ అయిన వాసిరెడ్డి పద్మ కూడా పాల్గొన్నారు.

Related posts