telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఉద్యోగికి బన్నీ బ్యాచిలర్ పార్టీ… పిక్ వైరల్

AA

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ వద్ద పనిచేసే ఓ వ్యక్తి బంపర్‌ ఆఫర్‌ కొట్టేశాడు. ఇటీవల బన్నీ వద్ద పని చేసే అభినవ్‌ నథ అనే వ్యక్తికి పెళ్లి ఫిక్స్‌ అయ్యింది. ఈ క్రమంలో బన్నీ అతనికి బ్యాచిలర్‌ పార్టీ ఏర్పాటు చేసి సర్‌ప్రైజ్‌ చేశాడు. అనంతరం తన ఉద్యోగులందరితో కలిసి ఫోటో కూడా దిగాడు. దీంతో ఆ ఉద్యోగి ఆనందంలో మునిగి తేలుతున్నాడు. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. కాగా తన స్టాఫ్‌ను కుటుంబ సభ్యుల్లో ఒకరిగా ట్రీట్‌ చేస్తానని, తన పెళ్లికి కూడా వెళతానని బన్నీ తెలిపాడు. ప్రస్తుతం బన్నీ సుకుమార్‌ దర్శకత్వంలో పుష్ప సినిమా చేస్తన్నాడు. ఎర్ర చెందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రష్మిక మందన ​హీరోయిన్‌గా నటిస్తున్నారు. కొంత వరకు షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ సినిమా నవంబర్‌లో తిరిగి ప్రారంభం కానుంది. కేరళ ఫారెస్ట్‌లో షూటింగ్‌ చెయ్యాలనుకున్న టీమ్, కరోనా ప్రభావంతో మనసు మార్చుకుంది. తెలుగు స్టేట్స్‌లోనే షూట్‌ చేస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లా మారేడుమిల్లి అడవుల్లో “పుష్ప’ షూటింగ్‌ రీస్టార్ట్ కాబోతోంది.

Related posts