telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మహేశ్ బాబు సతీమణి చిరకాల కోరిక అదేనట…

mahesh

మహేశ్ బాబును బాలీవుడ్‌కు కూడా పరిచయం చేయాలని నమ్రత ఎప్పటి నుంచో కలలు కంటోంది. అయితే మహేశ్ బాబు మాత్రం ఆమె కోరికను ఎప్పటికప్పుడు పెండింగ్‌లో పెడుతూ వస్తున్నాడు. అయితే తాజాగా నమ్రత కోరిక తీరే సమయం దగ్గర పడుతోందని టాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఆర్ఆర్ఆర్ తరువాత మహేశ్ బాబుతో సినిమా చేయబోతున్నానని దర్శకధీరుడు రాజమౌళి క్లారిటీ ఇచ్చేశారు. మహేశ్ బాబుతోనే తన నెక్ట్స్ మూవీ అనే విషయంలో మాత్రం ఎవరికీ ఎలాంటి అనుమానాలు లేకుండా చేశారు రాజమౌళి. ప్రస్తుతం రాజమౌళి సినిమా అంటే కచ్చితంగా పాన్ ఇండియా రేంజ్‌లో ఉంటుంది. అంటే మహేశ్ బాబుతో రాజమౌళి తెరకెక్కించబోయే సినిమా కూడా టాలీవుడ్, సౌత్ భాషలతో పాటు బాలీవుడ్‌లోనూ విడుదల కావడం ఖాయం. ఈ రకంగా మహేశ్ బాబు బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్నాడు. మొత్తానికి తన భర్త మహేశ్ బాబును బాలీవుడ్‌కు పరిచయం చేయాలనే నమ్రత కోరిక రాజమౌళి ద్వారా తీరనుంది.

Related posts