telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“వకీల్ సాబ్” టీజర్ రెడీ అవుతోందా ?

Vakeel-Saab

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ‘వకీల్ సాబ్’ షూటింగ్‌లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం పవన్ షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ప్రస్తుతం జరుగుతోన్న షెడ్యూల్‌తో ‘వకీల్ సాబ్’ సినిమా చాలా వరకు పూర్తవుతుంది. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో నివేదా థామస్ కీలక పాత్ర పోషిస్తున్నారు. అంజలి, అనన్య నాగళ్ల, ప్రకాష్ రాజ్, వీకే నరేష్, సుబ్బరాజు, అనసూయ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. శృతి హాసన్ అతిథి పాత్రలో కనిపించనున్నారు. పి.ఎస్. వినోద్ సినిమాటోగ్రఫీ అందిస్తోన్న ఈ చిత్రానికి ఎస్. తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. హిందీ హిట్ మూవీ ‘పింక్’కు రీమేక్‌గా వస్తోన్న ఈ సినిమాను దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక హైదరాబాద్‌లోని ఓ స్టూడియోలో వేసిన కోర్టు సెట్‌లో పవన్ కళ్యాణ్‌పై సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఇక ఈ చిత్రం టీజర్ కోసం అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు పవర్ స్టార్ అభిమానులు. ఈ దీపావళికే టీజర్ వస్తుంది అన్న టాక్ గట్టిగా వినిపిస్తున్న నేపథ్యంలో సంగీత దర్శకుడు థమన్ “వకీల్ సాబ్” రికార్డింగ్ సెషన్ లో తన టీం బిజీగా ఉన్నట్టుగా తెలిపారు. మరి ఇది టీజర్ కు సంబంధించిందా లేక పాటలకా అన్నది ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఇప్పుడెలాగో టీజర్ ను ప్రిపేర్ చేస్తున్నారని టాక్ వినిపిస్తుంది కాబట్టి అలా కూడా అనుకోవచ్చు. మరి పవన్ ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఈ టీజర్ ఎప్పుడు విడుదల కానుందో చూడాలి.

Related posts