telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

పోలవరానికి.. వైఎస్ పేరు.. కేంద్రం జోక్యం.. !

demand for ysr name to polavaram

దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరు ఏపీ ప్రజలకు వరప్రదాయిని పోలవరంకు పెట్టాలనే డిమాండ్ ఊపందుకుంది. ఈ మేరకు రాష్ట్రంలోని పలువురు వైఎస్సార్ అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. తాజాగా కర్నూలు జిల్లాకు చెందిన నేత సత్యం యాదవ్ పోలవరం ప్రాజెక్టుకు వైఎస్సార్ పేరు పెట్టాలంటూ డిమాండ్ చేశారు. పోలవరం ప్రాజెక్ట్ పనులు వైఎస్ హయాంలోనే ప్రారంభం అయ్యాయని, ఈ ప్రాజెక్ట్ ఆయన చిరకాల వాంఛ అని అన్నారు. ఆంధ్రప్రదేశ్ వరంగా పేర్కొనే పోలవరం ప్రాజెక్టుకు వైఎస్సార్ పేరు పెడితేనే సార్థకత ఉంటుందని సత్యం అన్నారు.

పోలవరం ప్రాజెక్టుతో వైఎస్సార్‌కు మంచి అనుబంధం ఉంది. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి సైట్‌ క్లియరెన్స్, పర్యావరణ అనుమతులు, భూసేకరణ, నిర్వాసితులకు భూముల కేటాయింపులు అన్నీ కూడా వైఎస్ హయాంలో జరిగినవే. అంతే కాదు జాతీయ హోదా కల్పించాలని కేంద్ర జల సంఘానికి కూడా వినతి పత్రం సమర్పించింది ఆయనేనని వైఎస్ సన్నిహితులు పేర్కొంటున్నారు. మరి దీనిపై ఏపీ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. ఒకవేళ ఏపీ ప్రభుత్వం పోలవరం పేరును మారిస్తే దానికి కేంద్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.

Related posts