telugu navyamedia
సినిమా వార్తలు

కమల్ హాసన్ పై కేసు నమోదు

Kamal-Hassan

భారత దేశం గర్వించదగ్గ నటుడు కమల్ హాసన్. నటనలో విశ్వరూపాన్ని చూపించే ఈ స్టార్ హీరో వ్యవహార శైలి వివాదాలకు కేంద్రబిందువుగా మారుతూ ఉంటుంది. ఇటీవల కమల్ హాసన్ హిందువుల మనోభావాలు దెబ్బతినేలా వ్యాఖ్యానించారు. కమల్ హాసన్ ఓ పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడుతూ భారత దేశంలో తొలి టెర్రరిస్ట్ హిందువే అని వ్యాఖ్యానించారు. గాంధీని హత్య చేసిన గాడ్సే హిందూ టెర్రరిస్ట్ అంటూ కమల్ హాసన్ తెలిపారు. మతంపేరుతో కొందరు దేశంలో మారణహోమం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని పరోక్షంగా కమల్ కమల్ హాసన్ బిజెపికి చురకలంటించారు. ఓ వ్యవస్థ, మతం, ప్రజల గురించి మాట్లాడే సమయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. కానీ కమల్ చేసిన ఈ వ్యాఖలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ఈ విషయంపై తమిళనాడు కరూర్ జిల్లాలో కమల్ పై రామకృష్ణ అనే వ్యక్తి కేసు నమోదు చేశారు. కమల్ హాసన్ హిందువులు టెర్రరిస్ట్ లు అంటూ చేసిన వ్యాఖ్యలు తమ మనోభావాల్ని కించపరిచే విధంగా ఉన్నాయని రామకృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేయగా కమల్ హాసన్ పై పోలీసులు 15ఏ, 295ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

Related posts