telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

జబర్దస్త్‌ షోలో రియల్ ఫైట్

jabardast

ఎక్స్‌ట్రా జబర్దస్త్‌ షోలో స్కిట్‌లో భాగంగా.. అప్పారావుని, భాస్కర్ కర్రతో గట్టిగా కొడతాడు. అయితే స్కిట్‌లో ఉన్నట్టుగానే కొడుతున్నాడన్న భావనలో భాస్కర్ ఉండగా.. అప్పారావుకి ఆ కర్ర దెబ్బలు గట్టిగా తగులుతాయి. దీంతో అప్పారావు ఒక రేంజ్‌లో ఫైర్ అవుతాడు. స్కిట్‌ని మధ్యలో ఆపేసి భాస్కర్‌తో గొడవ పడి, షర్ట్ విప్పేసి ఒంటిమీద వాతలను చూపిస్తాడు. తాను కూడా ఓ టీం లీడరే అని తెలిసి కూడా నన్ను ఇలా కొడతావా అంటూ గొడవ పడి, స్కిట్ మధ్యలో ఆపేసి, స్టేజ్ దిగి వెళ్లిపోతాడు. ఈ ఊహించని సంఘటనతో ఎక్స్‌ట్రా జబర్దస్త్‌ జడ్జ్‌లను, యాంకర్‌ని, టీం మెంబర్స్‌ని కూడా షాక్ అయ్యేలా చేసింది. జబర్దస్త్‌లో కొన్నిసార్లు ఈ రకమైన స్కిట్లలో కమెడియన్స్ బాధపడే అంశాలు జరిగినా అవి బయటకు చూపించరు. కానీ వచ్చే వారం ఎపిసోడ్ ప్రోమోలో భాస్కర్‌తో అప్పారావు గొడవ చూపించి షాక్ ఇచ్చారు. అయితే ఇది నిజంగా జరిగిందా? లేక స్కిట్‌లో భాగమా అనేది తెలియాలంటే వచ్చేవారం ఎపిసోడ్ వరకూ ఆగాల్సిందే.

Related posts