telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సినిమా వార్తలు

ట్విటర్ నీ టైమ్ అయిపోయింది : కంగనా

kangana

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ఈ పేరు అందరికీ సుపరిచితమే. ఆమె ఎక్కువగా కథానాయికగా కన్నా వివాదాల్లోనే కనిపిస్తుంటారు. నిత్యం ఏదోఒక వివాదంతో వార్తల్లోకెక్కుతుంటారు. అయితే కంగనా రనౌత్ ఢీల్లీలో లో జరుగుతున్న రైతుల ఉద్యమాన్ని ఉద్దేశించి ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. ఢిల్లీలో ఉద్యమం చేస్తుంది రైతులు కాదని, వారంతా ఉగ్రవాదులంటూ కంగనా ట్వీట్ చేశారు. అయితే ఆమె రైతులపై చేసిన ట్వీట్‌లను డిలీట్ చేసి ట్విటర్ యాజమాన్యం కంగనాకు షాక్ ఇచ్చింది. కంగనా చేసే ట్వీట్‌లు తమ నియమాలను ఉల్లంఘించాయని, అందుకనే వాటిని డిలీట్ చేశామని ట్విటర్ వారు తెలిపారు. అయితే ట్విట్టర్ లో ఈ తరహా పోస్ట్లు ఎక్కువగా రావడంతో ట్విట్టర్‌కు పోటీగా దేశీయ యాప్ కూను భారత ప్రభుత్వం ప్రమోట్ చేస్తోంది. ఇప్పుడిప్పుడే ప్రముఖులు ఈ యాప్ లోకి వస్తున్నారు. తాజాగా కంగనా కూడా కూలో చేరింది. కంగనా కూ యాప్‌లో చేరిన కొద్దిసేపటికే ట్విటర్‌కు కౌంటర్‌ ఇచ్చింది. ‘ట్విటర్ నీ టైమ్ అయిపోయింది.. కూ యాప్ ‌కు హాయ్ చెప్పే సమయం వచ్చింది’ అని ట్విట్టర్ కు వ్యతిరేకంగా కంగనా ట్వీట్ చేసింది. మరి ఇప్పుడు ట్విట్టర్ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

Related posts