telugu navyamedia
సినిమా వార్తలు

ఆర్ఆర్ఆర్ నుంచి నాటు నాటు ఫుల్‌ వీడియో సాంగ్ రిలీజ్ ..

రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ మల్టీస్టారర్ గా తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ మార్చి 25 న రిలీజ్ అయి.. బాక్సాఫీస్ వ‌ద్ద 1000 కోట్లు వ‌సూలు చేసింది.

ఇక ఈ చిత్రంలో చరణ్, తారక్ డాన్స్ తో అదరగొట్టిన నాటు నాటు సాంగ్ ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ఈ పాటను రీక్రియేట్‌ చేసేశారు అభిమానులు.

 RRR Hindi Version | ఒకప్పుడు దక్షిణాది సినిమాలను పెద్దగా పట్టించుకునే వాళ్లు కాదు ఉత్తారాది ప్రేక్షకులు. కానీ ఇప్పుడు అలా కాదు.. మన సినిమాలను అక్కడ వాళ్లు కూడా బాగా ఆదరిస్తున్నారు. సౌత్ సినిమాలు హిందీలో 100 కోట్ల గ్రాస్ వసూలు చేసే స్థాయికి ఎదిగింది. బాహుబలి నుంచి ఈ ట్రెండ్ మరీ ఎక్కువైపోయింది. మొన్న పుష్ప సినిమా కూడా 100 కోట్లు గ్రాస్ వసూలు చేసింది ఈ చిత్రం. తాజాగా విడుదలైన RRR సినిమాకు హిందీలో మొదటి రోజు రూ. 25 కోట్లు వసూలు చేసింది. మరోవైపు ఈ సినిమా రూ. 100 కోట్ల షేర్.. రూ. 200 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి సంచలనం రేపుతోంది. తాజాగా ఈ సినిమా 17 రోజలు హిందీ కలెక్షన్ల విషయానికొస్తే.. (Twitter/Photo) (Twitter/Photo)

సినిమా ప్రమోషన్స్‌లోనూ ఆమిర్‌ ఖాన్‌, సల్మాన్‌ ఖాన్‌, అనిల్‌ రావిపూడి, రాజమౌళి వంటి పలువురు సెలబ్రిటీలు ఈ పాటకు స్టెప్పులేసి అలరించారు. అంతలా సోషల్‌ మీడియాను ఓ ఊపు ఊపిన ఈ సాంగ్‌ లవర్స్‌ కోసం ఆర్‌ఆర్‌ఆర్‌ యూనిట్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చింది.

మవారం సాయంత్రం నాటు నాటు ఫుల్‌ వీడియో సాంగ్‌ను వదిలింది మూవీటీమ్‌. ఈ పాటను కాలభైరవ, రాహుల్‌ సిప్లిగంజ్‌ ఆలపించారు. కీరవాణి సంగీతం అందించారు. కాగా రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాను డీవీవీ దానయ్య నిర్మించారు.

Related posts