ఈ ఏడాది అంతర్జాతీయ క్రికెట్ మండలి యొక్క అవార్డ్స్ కు ఓటింగ్ ప్రారంభమైంది. ఇందులో ఓటు వేసిన వారికి మంచి బహుమతులు కూడా ఉంటాయి. అయితే ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది డికేడ్ అవార్డులో ఇద్దరు భారత ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రవిచంద్రన్ అశ్విన్ ఉన్నారు. మొత్తం ఏడుగురు క్రికెటర్లు ఈ నామినేషన్ల జాబితాలో ఉన్నారు. వారు స్టీవ్ స్మిత్, కేన్ విలియమ్సన్, జో రూట్, ఎబి డివిలియర్స్ మరియు కుమార్ సంగక్కర.
వన్డే ప్లేయర్ ఆఫ్ ది డికేడ్ : ఈ విభాగంలో విరాట్ కోహ్లీ(IND), రోహిత్ శర్మ(IND), ఎంఎస్ ధోని(IND), లాసిత్ మలింగ(SL), మిచెల్ స్టార్క్ (AUS), ఎబి డివిలియర్స్ (SA), కుమార్ సంగక్కర (SL) ఉన్నారు.
టెస్ట్ ప్లేయర్ ఆఫ్ ది డికేడ్ : విరాట్ కోహ్లీ(IND), జో రూట్(ENG), కేన్ విలియమ్సన్(NZ), స్టీవ్ స్మిత్(AUS), జేమ్స్ ఆండర్సన్ (ENG), రంగన హెరాత్ (SL), యాసిర్ షా (PAK) ఈ అవార్డుకు ఎంపికయ్యారు.
టీ 20 ప్లేయర్ ఆఫ్ ది డికేడ్ : రషీద్ ఖాన్ (AFG), కోహ్లీ(IND), ఇమ్రాన్ తాహిర్ (SA), ఆరోన్ ఫించ్ (AUS), మలింగ(SL), క్రిస్ గేల్ (WI) రోహిత్ శర్మ (IND) ఉన్నారు
ఐసీసీ స్పిరిట్ ఆఫ్ క్రికెట్ అవార్డు : విరాట్ కోహ్లీ (IND), కేన్ విలియమ్సన్ (NZ), బ్రెండన్ మెక్కల్లమ్ (NZ), మిస్బా-ఉల్-హక్ (PAK), ధోని(IND), అన్య ష్రబ్‌సోల్ (ENG), కేథరీన్ బ్రంట్ (ENG) , మహేలా జయవర్ధనే (SL), డేనియల్ వెట్టోరి (NZ) నామినేట్ అయ్యారు.