telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“బుర్ర ఉంది కదా… కొంచెం వాడు”… హరీష్ శంకర్ కు నెటిజన్ పంచ్

Harish-Shankar

హైదరాబాద్ మలక్ పేట్ దగ్గరలో 70 ఏళ్లు పైబడిన వ్యక్తి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నాడు.. దగ్గర్లోని యశోద హాస్పటల్ వాళ్లు స్పందించి అంబులెన్స్ పంపి ఆ వ్యక్తిని కాపాడాలని హాస్పటల్ సిబ్బందిని ట్విట్టర్ ద్వారా కోరారు హరీష్ శంకర్. అయితే ఈయన ట్వీట్‌పై వెంకట్ అనే నెటిజన్ స్పందిస్తూ.. “బుర్ర ఉంది కదా.. కొంచెం వాడు, ట్వీట్ చేసేకంటే అంబులెన్స్‌కి నువ్వే కాల్ చేయొచ్చు కదా.. నువ్ ట్వీట్ చేసేలోపు పేషెంట్ ఏమైనా అయితే..?” అంటూ పబ్లిసిటీ అనే హ్యాష్ ట్యాగ్ ఇచ్చాడు ఆ నెటిజన్. దీంతో ఖంగుతిన్న హరీష్ శంకర్.. వీడిని ఏమి అనాలో తెలియడం లేదు ఫ్రెండ్స్ అంటూ రీట్వీట్ చేశారు. అయితే చాలామంది వెంకట్ అనే నెటిజన్‌ను సమర్ధిస్తూ.. హరీష్ శంకర్ ట్వీట్ ఎందుకు చేయడం.. హాస్పటల్‌కి ఫోన్ అయినా చేయాలి.. లేదంటే 108కి అయినా కాల్ చేయాలి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తనికి హరీష్ చేసిన ఈ అంబులెన్స్ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Related posts