telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

జీఎస్టీ వసూళ్లపై కరోనా పంజా.. తొలిసారి తగ్గిన వసూళ్లు

1 crore loan on proper gst payers

జీఎస్టీ వసూళ్లపై కరోనా వైరస్ తీవ్ర ప్రభావం చూపింది. వరుసగా నాలుగు నెలలపాటు లక్ష కోట్లకుపైనే జీఎస్టీ వసూలైంది. అయితే, మార్చిలో ఇది రూ.97,597 కోట్లకు పడిపోయింది. జీఎస్టీ వసూళ్లు లక్ష కోట్లు దాటకపోవడం నాలుగు నెలల తర్వాత ఇదే తొలిసారి. అయినపట్టికీ కరోనా వైరస్ కారణంగా నిధుల లేమితో అల్లాడుతున్న రాష్ట్రాలకు కేంద్రం (జీఎస్టీ)తోపాటు పెండింగ్ నిధులను కూడా విడుదల చేయాలని నిర్ణయించింది.

అక్టోబరు, నవంబరు నెలలకు గాను నిన్న రూ.14,103 కోట్లను కేంద్రం విడుదల చేసినట్టు తెలుస్తోంది. అంతకుముందే తొలి విడత నిధులు రూ. 19,950 కోట్లను విడుదల చేసింది. అంటే మొత్తంగా రూ. 34,053 కోట్లను విడుదల చేసింది. డిసెంబరు, జనవరి నెలల నిధులను కూడా త్వరలోనే విడుదల చేయనున్నట్టు సమాచారం.

Related posts