telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

మహిళలను కాపాడటం చేత కాకుంటే..జగన్‌ రాజీనామా చేయలి

Anitha vangalapudi tdp

మహిళలను కాపాడటం చేతకాకుంటే సీఎం జగన్‌ వెంటనే పదవికి రాజీనామా చేయాలని టీడీపీ మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత డిమాండ్ చేశారు. ఆడబిడ్డలను కాపాడలేని సీఎం రాష్ట్రానికి అవసరమా? అని అడిగారు పోలీసులు కూడా ఈ అసమర్థ సీఎం పాలనలో విధినిర్వహణ మరిచారా? అని ప్రశ్నించారు. దిశ యాప్ పేరుతో హడావుడి తప్ప ఏం చేస్తున్నారని అన్నారు. ఢిల్లీ వెళ్లి కేసుల గురించి మాట్లాడుకోవడం తప్ప ఆడబిడ్డల రక్షణకోసం తెచ్చిన చట్టాన్నిఆమోదించమని కోరారా అని అనిత ప్రశ్నించారు. సొంత చెల్లికి న్యాయం చేయలేని సీఎం, రాష్ట్ర ఆడబిడ్డలను రక్షిస్తారా అని వంగలపూడి అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు.

Related posts