telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

రామ్ గోపాల్ వర్మకు అధికారి కౌంటర్…!?

Ram-Gopal-Varma

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మంగళవారం రాత్రి వర్మ తన ట్విటర్‌ ఖాతాలో ఓ వీడియో పోస్ట్ చేశారు. ఓ వ్యక్తి తన ఇంటి పెరడులో ఉన్న జంతువులను గన్నుతో కాలుస్తున్న వీడియో అది. ఈ వీడియోను పోస్ట్ చేస్తూ.. “ఓ అడవిలో జింకను చంపినందుకు సల్మాన్‌ని పోలీసులు, న్యాయస్థానాలు తరుముతున్నాయి. సల్మాన్‌కు వర్తించిన రూల్స్ ఈ వీడియోలో కనిపిస్తున్న వ్యక్తికి వర్తించవా? అతను తన ఇంటి ముందు భాగంలో ఉన్న జంతువులనే గన్నుతో చంపాలని చూస్తున్నాడు. ఒకవేళ దేశంలో ఇంకా న్యాయం బతికే ఉన్నప్పుడు నా ప్రశ్నకు పోలీసులు, న్యాయస్థానాలు సమాధానాలు చెప్పాలి. సల్మాన్ చేసిన ఒకే ఒక తప్పు ఏంటంటే.. అతను సెలబ్రిటీ అవ్వడం. అందుకే పోలీసులు ఆయన్ను శిక్షించాలని అనుకుంటున్నారు” అని పేర్కొన్నారు. అయితే ఈ వీడియోను చూసిన పర్వీన్ కస్వాన్ అనే ఐఎఫ్‌ఎస్ అధికారి స్పందిస్తూ “మీరు ఈ ప్రశ్న బంగ్లాదేశ్ పోలీసులను అడగాలి. ఎందుకంటే మీరు పోస్ట్ చేసిన వీడియో ఇండియాలోది కాదు బంగ్లాదేశ్‌ది. కచ్చితంగా చెప్పలంటే చిట్టగాంగ్‌లోని వ్యక్తికి సంబంధించినది’” అంటూ కౌంటర్ వేశారు. 1990లో ‘హమ్ సాథ్ సాథ్ హై’ సినిమా షూటింగ్ సమయంలో సల్మాన్ రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ అడవుల్లో కృష్ణజింకలను వేటాడి సమస్యల్లో చిక్కుకున్న విషయం తెలిసిందే.

Related posts