telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ప్రభుత్వ స్కూళ్లను దత్తత తీసుకున్న ప్రముఖ హీరో… పేద విద్యార్థులకు సాయంగా..!

Sudeep

కరోనా సమయంలో కూడా సినీ కార్మికుల కోసం సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు పెద్ద మొత్తంలో విరాళాలు ఇచ్చిన సంగతి తెలిసింది. ప్రధాని, ముఖ్యమంత్రుల సహాయ నిధికి కూడా కరోనా కోసం కోట్లు, లక్షల్లో విరాళాలు అందించారు. కొందరు సెలబ్రిటీలు అయితే గ్రామాల్ని సైతం దత్తత తీసుకొని అక్కడ కావాల్సిన వాటిని ఏర్పాటు చేస్తున్నారు. తాజాగా ప్రముఖ కన్నడ హీరో కిచ్చా సుదీప్ పేద విద్యార్థుల కోసం ముందుకు వచ్చాడు. కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లాల్లో తన చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 4 ప్రభుత్వ పాఠశాలలను సుదీప్ దత్తత తీసుకున్నాడు. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించేలా స్కాలర్ షిప్ ప్రోగ్రామ్స్ నిర్వహించడంతోపాటు వారికి డిజిటల్ క్లాస్ రూంలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు వాలంటీర్స్ టీంతో కలిసి ప్లాన్ చేశాడు. సుదీప్ స్కూళ్లున్న ప్రాంతాలు, అక్కడున్న వసతులు, ఇతర అంశాలను స్టడీ చేసేందుకు ఇప్పటికే వాలంటీర్లను ఆయా ప్రాంతాలకు పంపిచాడు. అక్కడున్న సమాచారం మొత్తాన్ని సేకరించాడు. సుదీప్ ఇదంతా చాలా గోప్యంగా చేస్తున్నట్లు సమాచారం. సైరా చిత్రం తర్వాత సుదీప్ ఫాంటోమ్‌, కిట్టీ-కోటిగొబ్బ 3, బిల్లా రంగా భాషా, థగ్స్ ఆఫ్ మాల్గుడి చిత్రాలతో బిజీగా ఉన్నాడు. తన నటనతో కన్నడతోపాటు తెలుగు, తమిళ, హిందీ భాషల్లో కూడా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు సుదీప్.

Related posts