telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

కేంద్రం ట్విస్ట్… వ్యాక్సిన్లు పూర్తిగా ఉచితం కాదు

corona vacccine covid-19

మన దేశంలో మే 1 తేదీ నుంచి 18 ఏళ్లు నిండిన‌వారికి కూడా వ్యాక్సిన్ ఇవ్వ‌నున్నారు.. అయితే, ఈ భారం మొత్తం రాష్ట్ర ప్ర‌భుత్వాలే భ‌రించాల్సి ఉంటుంద‌ని.. అది కూడా కేంద్రానికి ఇచ్చిన ధ‌ర కంటే ఎక్కువ ధ‌ర చెల్లించి ఆయా రాష్ట్రాలే వ్యాక్సిన్ల‌ను స‌మ‌కూర్చుకోవాల‌ని కేంద్రం స్ప‌ష్టం చేసింది.. అయితే, దీనిపై రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వ‌చ్చాయి.. కొన్ని రాష్ట్రాలు కేంద్రంతో సంబంధం లేకుండా వ్యాక్సిన్‌ను ఉచితంగా అందిస్తామ‌ని ప్ర‌క‌టించ‌గా.. ఇవాళ‌.. కేంద్రమే మొత్తం వ్యాక్సిన్‌ను ఉచితంగా అందిస్తుంద‌నే వార్త హ‌ల్ చ‌ల్ చేసింది.. అయితే, దీనిపై క్లారిటీ ఇచ్చింది కేంద్రం.. తాము టీకాల‌ను పూర్తిగా ఉచితంగా స‌ర‌ఫ‌రా చేయ‌లేమంటూ మ‌రో ట్విస్ట్ ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వాలకు పంపిణీ చేసే కరోనా టీకాల ఖర్చులో 50 శాతం మాత్ర‌మే తాము భరిస్తామని కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది.. అంటే.. మిగ‌తా 50 శాతం వ్యాక్సిన్ ఖర్చును ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే భరించాల్సి ఉంటుంద‌న్న‌మాట‌.. మొత్తంగా.. వ్యాక్సిన్ ఖ‌ర్చును పూర్తిగా కేంద్ర‌మే భ‌రిస్తుందంటూ వ‌స్తున్న వార్త‌ల‌పై స్పందిస్తూ.. ఇలా క్లారిటీ ఇచ్చింది కేంద్రం.

Related posts