ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం ప్రజల సొమ్ముతోనే సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. మంగళవారం కాకినాడ టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్రం నుంచి నిధులు రాకపోయినా పథకాల అమలు విషయంలో వెనక్కి తగ్గలేదన్నారు. ప్రత్యేక ప్యాకేజీ కింద ఏపీకి ఒక్క రూపాయి కూడా రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పోలవరం నిర్మాణం విషయంలో కేంద్రం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని యనమల ఆవేదన వ్యక్తం చేశారు. విభజన హామీలు అమలు చేయకుండా టీడీపీని ఇబ్బంది పెట్టేందుకు కుట్రలు సాగుతున్నాయని వ్యాఖ్యానించారు. షెడ్యూల్ 9,10 సంస్థలను జనాభా ఆధారంగా ఆస్తులను విభజిస్తే రూ.43,000 కోట్లు రావాలని తెలిపారు.వీటిలో ఒక్క రూపాయి కూడా ఏపీకి రాలేదన్నారు. జగన్, మోదీ, కేసీఆర్ లతో చేతులు కలిపి ఏపీకి అన్యాయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాజకీయాలు కావాలంటే స్పీకర్ పదవికి రాజీనామా చేయాలి: జవహర్