telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ వార్తలు

రామతీర్థం కేసులో రెండు రోజుల్లో అరెస్టులు జరుగుతాయి : వెలంపల్లి

రామతీర్థంలో జరిగిన ఘటన పై విచారణ చేస్తున్నారని, రామతీర్థం ఘటనలో రెండు రోజుల్లో అరెస్టులు జరుగుతాయని మంత్రి  వెలంపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. రామతీర్థం ఘటనపై సీఐడీ విచారణ కు ఆదేశిస్తున్నామని అన్నారు. రామతీర్థం ఆలయాన్ని ఆధునీకరణ చేయనున్నామన్న ఆయన ఆలయ నిర్మాణ పనులు, విగ్రహ ప్రతిష్ఠ పనులపై టీటీడీ తో సంప్రదింపులు జరిపి పనులు మొదలు పెడతామని అన్నారు. రామతీర్థం చాలా చిన్న ప్రాంతం, ఇరుకు ప్రాంతం కాబట్టి అక్కడ రేపు ర్యాలీలు చేయవద్దని బీజేపీని కోరుతున్నానని అన్నారు. ప్రభుత్వం సలహాలు సూచనలు స్వీకరిస్తాం, రాజకీయ బురద, కుట్ర చేయటం సరికాదని అన్నారు. రాజమండ్రి ఆలయంలో సుబ్రమణ్య స్వామి ఆలయ దాడిపై కూడా సీఐడీ విచారణ కు ఆదేశిస్తున్నామని అన్నారు. దేవాదాయ శాఖ కు  సంబంధించి 8 ఆలయాల్లో ఘటనలు జరిగాయని చోరీలు, గుప్త నిధుల, ఇతర కారణాలపై 88 కేసులు అయ్యాయని అన్నారు. 159 మందిని అరెస్టులు జరిగాయన్న అయన 57,584 దేవాలయాలు ఏపీలో ఉన్నట్టు మ్యాపింగ్ జరిగిందని అన్నారు. 3618 ఆలయాల దగ్గర సీసీ టీవీలు ఉన్నాయి 13166 కెమెరాలు ఏర్పాటు అయ్యాయని 39,076 కెమెరాలు ప్రభుత్వం నుంచి ఏర్పాటు చేసి పరివేక్షణ చేస్తున్నామని అన్నారు. ప్రైవేట్, ప్రభుత్వ ఆలయాల దగ్గర కూడా పోలీస్ నిబంధనల అమలుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. దేవాదాయ శాఖ నిధులు వేరే వాటికి వినియోగించటం లేదని ఆలయాల కోసమే దేవాదాయ శాఖ నిధులు వినియోగిస్తున్నామని అన్నారు. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది.

Related posts